గోల్డ్ కాయిన్ పథకంలో సవరణలు.. ఇకనుంచి 1 గ్రాము, 2 గ్రాముల కాయిన్స్ అందుబాటులోకి.. కొనుగోలుకు సులువైన మార్గాలు..
Indian Gold Coin Scheme : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన భారత బంగారు నాణెం పథకంలో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇక నుంచి వినియోగదారులు ఈ పథకంలో సలువుగా చేరవచ్చు.

Indian Gold Coin Scheme : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన భారత బంగారు నాణెం పథకంలో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇక నుంచి వినియోగదారులు ఈ పథకంలో సలువుగా చేరవచ్చు. ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో సహా పలు మార్కెటింగ్ మార్గాల ద్వారా ఇందులో చేరవచ్చు. ఎమ్‌ఎమ్‌టిసి, జ్యువెలర్స్, బ్యాంకులు, ఇండియా పోస్ట్ మొదలైన వాటి ద్వారా నేరుగా కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తోంది. సవరణకు ముందు ఐజిసి 5, 10, 20 గ్రాముల వర్గాలలో మాత్రమే గోల్డ్ కాయిన్స్ లభించేవి. ప్రస్తుతం 1 గ్రాము, 2 గ్రాముల కాయిన్స్‌ను సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్పిఎంసిఐఎల్) ముద్రించడానికి అనుమతి లభించింది. విదేశీ బంగారు నాణేల దిగుమతిని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఎస్‌పిఎంసిఐఎల్ ముద్రించిన ఐజిసిలతో ఎమ్‌ఎమ్‌టిసి అమలు చేస్తోంది. ఆధునిక భద్రతా లక్షణాలతో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నాణేలు ఇవి. భారతీయ గోల్డ్ కాయిన్ పథకంలో చేసిన మార్పులు ఈ విధంగా ఉన్నాయి.
1. ఇప్పుడు, ఎస్పిఎంసిఐఎల్, ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్, విమానాశ్రయాలతో ఈ కాయిన్స్‌ని కొనుగోలు చేయవచ్చు. 2. ప్రత్యక్ష అమ్మకాలకు ఎమ్‌ఎమ్‌టిసి, జ్యువెలర్స్, బ్యాంకులు, ఇండియా పోస్ట్ మొదలైన పలు మార్కెటింగ్ మార్గాల ద్వారా అందుబాటులో ఉంచుతుంది. 3. బోర్డు ఆమోదించిన విధానం ఆధారంగా ఎస్పిఎంసిఐఎల్ తన ఇ-కామర్స్ పోర్టల్ ద్వారా ఐజిసిలపై ఎగుమతి ఆర్డర్లను అందిస్తుంది. 4. ఐజిసిలు భాగస్వాముల ద్వారా భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో డ్యూటీ ఫ్రీ కౌంటర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. 5. ప్రస్తుతం, కాయిన్స్ 24 క్యారెట్లలో 999 సొగసుతో మాత్రమే ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు 999 మరియు 995 స్వచ్ఛత రెండింటిలో 24 క్యారెట్లలో కాయిన్స్ అందుబాటులో ఉంటాయి. 6. ప్రస్తుతమున్న 5,10 మరియు 20 గ్రాములకు అదనంగా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికోసం 1 గ్రాము, 2 గ్రాముల కాయిన్స్ ను చేయడానికి ప్రభుత్వం ఎస్పిఎంసిఐఎల్‌కు అనుమతించింది. 7. ఈ బంగారు నాణేలకు ఎంఎమ్‌టిసి మద్దతు ఉన్నందున, వినియోగదారులకు బంగారు నాణేలను బహిరంగ మార్కెట్లో అమ్మడం సులభం అవుతుంది.