Tata Motors: టాటా మోటార్స్ ఆటోమొబైల్(Auto Mobiles) అమ్మకాలు ఏప్రిల్ 2022లో భారీగా నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే వాహనాల అమ్మకాలు మూడింట రెండు వంతులు పెరుగుదల నమోదు చేశాయి. ఇదే సమయంలో హ్యుందాయ్ ఇండియా, మారుతి సుజుకి మాత్రం అమ్మకాల్లో క్షీణతను ఎదుర్కొన్నాయి. మే 1న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. టాటా మోటార్స్ 2021 ఏప్రిల్‌లో 41,729 యూనిట్లతో పోలిస్తే.. 2022 ఏప్రిల్ నెలలో 72,468 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఏడాది కాలానికి 74 శాతం వృద్ధిని టాటా మోటార్స్ నమోదు చేసింది. ఏప్రిల్ 2022లో కంపెనీ మొత్తం దేశీయ విక్రయాలు 71,467 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో 30,838 వాణిజ్య వాహనాలు, 41,587 ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయి.
హ్యుందాయ్(Hyundai India) ఇండియా ఏప్రిల్ 2022 నెలలో 56,201 యూనిట్లను అమ్మింది. వీటిలో 44,001 యూనిట్లను దేశంలో విక్రయించగా.. 12,200 యూనిట్ల ఎగుమతి విక్రయాలను నమోదు చేసింది. సంవత్సర ప్రాతిపదికన ఎగుమతి వాహనాల అమ్మకాలు 5 శాతం క్షీణించగా.. దేశీయ అమ్మకాలు 10 శాతం మేర క్షీణతను నమోదు చేశాయి. మారుతీ సుజుకి ఏప్రిల్ క్యుములేటివ్ అమ్మకాలు 5.7 శాతం క్షీణించాయి. కంపెనీ ఈ నెలలో మొత్తం 1.50 లక్షల యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం ఈ అమ్మకాలు 1.59 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.
మారుతీ ద్వారా మొత్తం దేశీయ విక్రయాలు 1.26 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ 2021లో ఇదే కాలానికి 1.37 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు గత నెలలో 1.21 లక్షలు నమోదు కాగా.. గత సంవత్సరం ఇదే కాలంలో 1.35 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దీనిపై స్పందించిన మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సి భార్గవ.. కంపెనీ “బ్రెడ్ అండ్ బటర్” సెగ్మెంట్ నుండి “బటర్” దూరంగా పోయిందని అన్నారు. నియంత్రణ మార్పులు, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, ముడి పదార్ధాల ధరల పెరుగుదల వంటి కారణాలు ప్రభావితం చేస్తున్నాయని అన్నారు.
ఇవీ చదవండి..
Edible Oil: వంట నూనెల ధరలపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. విషయం ఏంటంటే?
Stock Market: నష్టాలతో నెల ప్రారంభించిన స్టాక్ మార్కెట్.. బేర్ పంజాతో సూచీల కుదేలు..