Digital Rupee: త్వరలోనే ఇండియాలో డిజిటల్ రూపీ .. ఇదెలా ఉండబోతుంది? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!

మీరు క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ గురించి వినే ఉంటారు. ఇదొక డిజిటల్ కరెన్సీ అంటే ఫిజికల్ కరెన్సీకి ఎలక్ట్రానిక్ రూపం అనుకోవచ్చు. ప్రస్తుతం చాలా దేశాలు ఇలాంటి డిజిటల్ కరెన్సీని వాడుతున్నాయి. అయితే మనదేశం కూడా త్వరలో సొంత డిజిటల్ కరెన్సీని లాంఛ్ చేయబోతోంది. దీని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Digital Rupee: త్వరలోనే ఇండియాలో డిజిటల్ రూపీ .. ఇదెలా ఉండబోతుంది? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!
Digital Rupee

Updated on: Oct 07, 2025 | 1:49 PM

భారత్ త్వరలోనే సొంత డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయబోతోందని యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పియూష్ గోయల్ ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుందట. దీన్ని సాధారణ ప్రజలు కూడా ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకోవచ్చు. ఇదెలా పనిచేస్తుందంటే..

డిజిటల్ కరెన్సీ అంటే..

భారత్ తీసుకురాబోయే డిజిటల్ కరెన్సీని ‘డిజిటల్​ రూపీ’ అంటారు. కేంద్ర రిజర్వ్ బ్యాంక ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఇది ఫిజికల్ కరెన్సీతో సమానంగా వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న క్రిప్టో అనే కరెన్సీలో చాలామంది భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు. అయితే క్రిప్టో అనేది అఫీషియల్ డిజిటల్ కరెన్సీ కాదు. కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే డిజిటల్ రూపీ అలాంటిది కాదు. ఈ కరెన్సీతో ప్రపంచ వాణిజ్యం జరుపుతారు. భారత ఎకానమీని బట్టి దీని వాల్యూపెరగడం తగ్గడం ఉంటుంది. కాబట్టి డిజిటల్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు ఇకపై డిజిటల్ రూపీపైనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కాకుండా మరే ఇతర క్రిప్టో కరెన్సీ ఉపయోగించినా లాభాల్లో 30శాతం పన్ను విధిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.

పూర్తిగా సేఫ్

ఇకపోతే  డిజిటల్ కరెన్సీ లావాదేవీలకు చాలా ఈజీగా ఉంటుంది. బ్యాంకుల్లో జరిగే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కంటే ఈ డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చాలా వేగవంతంగా ఉంటాయి. ఇందులో కూడా పూర్తి ట్రాన్పరెన్సీ, ట్రేసబులిటీ ఉంటుంది. అంటే పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. క్రిప్టో మాదిరిగా సేఫ్టీ ఇష్యూ ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Follow Us