Home Loan: పెరుగుతున్న హోమ్ లోన్ ఈఎంఐ బాదుడు.. ఆ టిప్స్ పాటిస్తే సమస్య ఫసక్

సొంత ఇంట్లో ఉండడం అనేది ప్రజలు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది పొదుపు మార్గంవైపు పయనిస్తూ ఉంటారు. అయితే పొదుపు అనుకున్న స్థాయికు చేరుకోకపోయినా బ్యాంకులు అందించే లోన్ల ద్వారా సొంతింటి కలను నిజం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఈ కోవలోకి ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి నెలా వేలల్లో ఇంటి అద్దె కట్టే బదులు ఇంటి అద్దెను ఈఎంఐగా కడితే సొంతిల్లు సమకూరుతుందనే ఆశలో వారు బ్యాంకు లోన్లపై ఆధారపడి సొంత ఇల్లు లేదా ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తూ ఉంటారు.

Home Loan: పెరుగుతున్న హోమ్ లోన్ ఈఎంఐ బాదుడు.. ఆ టిప్స్ పాటిస్తే సమస్య ఫసక్
Home Loan
Follow us

|

Updated on: Jun 11, 2024 | 2:50 PM

సొంత ఇల్లు అనేది ప్రతి మనిషికి సంబంధించిన చిరకాల కోరికగా ఉంటుంది. ముఖ్యంగా సొంత ఇంట్లో ఉండడం అనేది ప్రజలు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది పొదుపు మార్గంవైపు పయనిస్తూ ఉంటారు. అయితే పొదుపు అనుకున్న స్థాయికు చేరుకోకపోయినా బ్యాంకులు అందించే లోన్ల ద్వారా సొంతింటి కలను నిజం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఈ కోవలోకి ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి నెలా వేలల్లో ఇంటి అద్దె కట్టే బదులు ఇంటి అద్దెను ఈఎంఐగా కడితే సొంతిల్లు సమకూరుతుందనే ఆశలో వారు బ్యాంకు లోన్లపై ఆధారపడి సొంత ఇల్లు లేదా ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న ఖర్చులు ఈఎంఐ చెల్లింపులను ప్రభావితం చేస్తుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో హోమ్‌లోన్ తీసుకున్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలతో ఖర్చులను సేవ్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

రుణ కాల వ్యవధి

మీ లోన్ టర్మ్ ఎక్కువగా ఉంంటే మీరు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రుణ కాలవ్యవధిని తక్కువగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు 10 సంవత్సరాలకు 9 శాతం వడ్డీతో రూ.50 లక్షల రుణం తీసుకుంటే మీరు రూ.26 లక్షల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మీరు కాలపరిమితిని 15 సంవత్సరాలకు పొడిగిస్తే వడ్డీ రూ.41 లక్షలకు పెరుగుతుంది. 20 సంవత్సరాలకు రూ.58 లక్షలకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మన చెల్లింపుల్లో సింహభాగం వడ్డీకే సరిపోతుంది. ఈ నేపథ్యంలో రుణ కాలవ్యవధిని తక్కువ ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

ఈఎంఐ పెంపు

చిన్న లోన్ టర్మ్ ఉంటే అధిక ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది యువతకు కఠినంగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా 15 20 సంవత్సరాల లోన్ తీసుకుంటే, మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ ఈఎంఐని పెంచుకోవడం ఉత్తమం. మీ ఈఎంఐలో 5 శాతం పెరుగుదల 20 సంవత్సరాల రుణ కాల వ్యవధిని దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు తగ్గించవచ్చు. మీరు సంవత్సరానికి ఈఎంఐను 10 శాతం పెంచుకుంటే మీరు కేవలం 10 సంవత్సరాలలో రుణాన్ని పూర్తి చేయవచ్చు. అలాగే లోన్ టర్మ్ ప్రారంభంలోనే ఈఎంఐలను పెంచడం వల్ల లోన్‌ను ప్రీపే చేయడంలో బోనస్‌లు వంటివి లభించే అవకాశం ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

రుణ బీమా

పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నప్పుడు రుణంపై బీమా తీసుకోవడం తెలివైన పని. కాబట్టి మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబంపై భారం పడదు. అయితే మీరు రుణాన్ని చెల్లించే కొద్దీ గృహ రుణాలతో బ్యాంకులు విక్రయించే బీమా తగ్గుతుంది. ఈ బీమా కూడా తరచుగా రుణంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు రీఫైనాన్స్ చేస్తే పాలసీ ముగుస్తుంది. ఇలాంటి సమయంలో ప్రత్యేక టర్మ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. మీరు రుణాన్ని ముందుగానే చెల్లించినా లేదా రుణదాతలను మార్చుకున్నా కూడా ఇది కొనసాగుతుంది.

ఉమ్మడి గృహ రుణం

గృహ రుణ వడ్డీపై ప్రభుత్వం పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. సెక్షన్ 24బి కింద, మీరు వడ్డీ తగ్గింపుల్లో గరిష్టంగా రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు. అయితే ఉమ్మడి లోన్‌పై ఒక్కొక్కరు రూ2 లక్షలు క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అంటే దాదాపుగా మొత్తం రూ.4 లక్షల తగ్గింపును పొందవచ్చు. కొన్ని రాష్ట్రాలు ఆస్తి స్త్రీ పేరు మీద ఉంటే తక్కువ స్టాంప్ డ్యూటీని అందిస్తాయి. ఉదాహరణకు ఢిల్లీలో పురుషులకు 6 శాతం స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే మహిళలు 4 శాతం చెల్లిస్తే సరిపోతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి