Income Tax Return: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా? ఈ పొరపాటు చేస్తే రూ.5 వేల జరిమానా తప్పదు

|

Apr 02, 2023 | 9:30 PM

కొత్త ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభమైంది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పౌరులకు ఆదాయపు పన్ను రిటర్న్..

Income Tax Return: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా? ఈ పొరపాటు చేస్తే రూ.5 వేల జరిమానా తప్పదు
Nirmala Sitharaman
Follow us on

కొత్త ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభమైంది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పౌరులకు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి. ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి రెండు రకాల పన్ను వ్యవస్థలు ఉన్నాయి. పాత పన్ను విధానం, ఇప్పుడు కొత్త పన్ను విధానం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు అవుతోంది. ఈ రెండు పథకాలు వేర్వేరు పన్ను స్లాబ్‌లను కలిగి ఉన్నాయి. పన్నుల వ్యవస్థను మరింత ఉదారంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించింది.

పన్ను చెల్లింపుదారులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను జూలై 31లోగా ఫైల్ చేయాలి. ఫిబ్రవరి నెలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌ ఫారమ్‌లను విడుదల చేసింది. పన్ను చెల్లింపుదారులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. వివిధ వ్యక్తులు, నిపుణులు, కంపెనీల కోసం ఏడు రకాల ఐటీఆర్ ఫారమ్‌లు ఉన్నాయి. వీటిలో ITR 1, ITR 2, ITR 3, ITR 4, ITR 5, ITR 6, ITR 7 ఉన్నాయి.

ఈ పొరపాటు చేస్తే జరిమానా తప్పదు:

వివిధ అవసరాలకు అనుగుణంగా వివిధ ఐటీఆర్ ఫారమ్‌లను ఫైల్ చేయవచ్చు. ITR-1, ITR-4 ఫైల్ చేయడం పెద్ద సంఖ్యలో చిన్న, మధ్యస్థ పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ నింపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే 5 వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. పన్ను చెల్లింపుదారుడు జూలై 31 నాటికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయలేకపోతే, అతను డిసెంబర్ 31 నాటికి ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆలస్యానికి అతను తప్పకుండా భారీ జరిమానా చెల్లించుకోవాల్స ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. మీరు మీ ఐటీఆర్‌ను ఆలస్యంగా ఫైల్ చేస్తే మీరు రూ. 5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామణ స్పష్టం చేశారు. ఆ తర్వాత గడువు తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద కూడా జరిమానా విధించే నిబంధన ఉంది.

ఇవి కూడా చదవండి

మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసిన తర్వాత అది తప్పనిసరిగా 30 రోజులలోపు ధృవీకరణ కావాలని గుర్తుంచుకోండి. ఒక వేళ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలును ధృవీకరణ కానట్లయితే ఆదాయపు పన్ను శాఖ తదుపరి ప్రాసెసింగ్ కోసం తీసుకోదు. ఇది మాత్రమే కాదు.. మీరు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయలేదని ధృవీకరిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి