Bank Customers Alert: బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. IMPS ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ పెంపు

|

Oct 09, 2021 | 10:20 AM

IMPS Transaction Limit: బ్యాంకింగ్‌ లావాదేవీల విషయాలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఎన్నో మార్పులు చేస్తూ వస్తోంది. ఇక మనీ ట్రాన్సాక్షన్‌ విషయంలో కూడా..

Bank Customers Alert: బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. IMPS ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ పెంపు
Follow us on

IMPS Transaction Limit: బ్యాంకింగ్‌ లావాదేవీల విషయాలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఎన్నో మార్పులు చేస్తూ వస్తోంది. ఇక మనీ ట్రాన్సాక్షన్‌ విషయంలో కూడా నిబంధనలు కూడా మార్పులు చేస్తోంది. ఇక తాజాగా ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇమ్మీడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (IMPS) ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల వరకు లిమిట్‌ను ఏకంగా రూ.5 లక్షల వరకు పెంచేసింది. ఇకపై బ్యాంక్ కస్టమర్లు ఐఎంపీఎస్ ద్వారా రూ.5 లక్షల వరకు డబ్బులు పంపుకొనే వెలుసుబాటు కల్పించింది ఆర్బీఐ.

ఆర్‌బీఐ మానెటరీ పాలసీ కమిటీ (MPC) శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కమిటీ. ఆ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఐఎంపీఎస్ లిమిట్ పెంచుతున్నట్టు ప్రకటించారు. కాగా, కస్టమర్ల కోసం ఇలాంటి సర్వీస్‌ను 2010లో ప్రారంభించింది. మొదట కేవలం 4 బ్యాంకుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఐఎంపీఎస్ సేవలను ప్రారంభించగా, ప్రస్తుతం భారతదేశంలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఐఎంపీఎస్ సేవలను అందిస్తున్నాయి. ఇది 24 గంటలు పనిచేసే రియల్ టైమ్ మనీ సర్వీస్. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో ఖాతాకు క్షణాల్లో డబ్బుల్ని పంపేందుకు ఐఎంపీఎస్ సర్వీస్ ఉపయోగపడుతుంది. దేశంలోని 150 కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కస్టమర్లు ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు.

నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ చేయవచ్చు. లావాదేవీని బట్టి ఛార్జీలు ఉంటాయి. ఐఎంపీఎస్ ద్వారా డబ్బులను పంపితే కనీసం రూ.5 ఛార్జీ చెల్లించాలి. గరిష్టంగా రూ.15 ఛార్జీ ఉంటుంది. అదనంగా సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతుంటాయి.

ఇవీ కూడా చదవండి:

Blue Color Aadhaar: నీలం రంగులో ఉన్న ఆధార్‌ను ఎవరికి జారీ చేస్తారు.. ఈ కార్డు పొందడం ఎలా..?

Hyderabad Tour Package: పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. దసరా సెలవుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ టూర్ ప్యాకేజీ