AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 Notes: పోస్ట్‌లో రెండు వేల నోటు పంపితే అకౌంట్‌లో డబ్బులు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

ప్రజలు తమ రూ. 2,000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు బీమా చేసిన పోస్ట్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ నిర్దిష్ట ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే వాటిని చెక్‌ చేసి సొమ్మును బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయం చాలా మందికి ఉపయోగపడనుంది. ఆర్‌బీఐ తాజా ఆఫర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

2000 Notes: పోస్ట్‌లో రెండు వేల నోటు పంపితే అకౌంట్‌లో డబ్బులు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన
Rs 2000 Notes
Nikhil
| Edited By: |

Updated on: Nov 04, 2023 | 8:50 AM

Share

2016లో చేసిన నోట్ల రద్దు భారతదేశంలో ఎంత ప్రభావం చూపిందో? అందరికీ తెలుసు. ఒక్క రాత్రిలోనే నోట్లు రద్దు చేసింది ప్రభుత్వం. అప్పటి అవసరాలను తీర్చడానికి రూ.2000 నోట్లను మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. అయితే ఈ నోట్లను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. కానీ చాలా మంది ప్రజల వద్ద రూ. 2వేల నోట్లు ఉన్నాయని తేలడంతో ఆర్‌బీఐ ఓ కొత్త వెసులుబాటును కల్పించింది. ప్రజలు తమ రూ. 2,000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు బీమా చేసిన పోస్ట్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ నిర్దిష్ట ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే వాటిని చెక్‌ చేసి సొమ్మును బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయం చాలా మందికి ఉపయోగపడనుంది. ఆర్‌బీఐ తాజా ఆఫర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆర్‌బీఐ వారి బ్యాంకు ఖాతాలో రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి టీఎల్‌ఆర్‌ (ట్రిపుల్ లాక్ రిసెప్టాకిల్) ఫారమ్‌ను అందిస్తోంది. కస్టమర్‌లు రూ. 2,000 నోట్లను బీమా చేసిన పోస్ట్ ద్వారా ఆర్‌బిఐకి వారి ఖాతాలో అత్యంత అతుకులు లేకుండా సురక్షితమైన పద్ధతిలో నేరుగా జమ చేయడానికి మంచి అవకాశం. ముఖ్యంగా బ్యాంకుల శాఖలను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఆర్‌బీఐ నిర్ణయం దోహదం చేస్తుంది. ఆర్‌బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి దాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీఎల్‌ఆర్‌తో పాటు బీమా చేసిన పోస్ట్‌కు సంబంధించిన రెండు ఎంపికలు అత్యంత సురక్షితమైనవి. ఈ ఎంపికపై ప్రజల్లో ఎలాంటి భయాలు లేవని ఇప్పటిక వరకూ సుమారు 700 టీఎల్‌ఆర్‌ ఫారమ్‌లు అందాయని ఆయన వివరించారు. ఆర్‌బీఐ తన కమ్యూనికేషన్లలో తన కార్యాలయాల్లో మార్పిడి సౌకర్యం కాకుండా ఈ రెండు ఎంపికలను అందిస్తుంది. 

మే 19న రూ.2000 డినామినేషన్ బ్యాంకు నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి వచ్చాయి. ముఖ్యంగా ఢిల్లీతో పాటు అన్ని ప్రాంతీయ ఆర్‌బీఐ కార్యాలయాల్లో సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. రూ.2 వేల నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు, సంస్థలు మొదట సెప్టెంబర్ 30లోగా వాటిని మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని కోరారు. గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. అక్టోబరు 7న బ్యాంక్ బ్రాంచ్‌ల్లో డిపాజిట్, మార్పిడి సేవలు రెండూ నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

అక్టోబరు 8 నుంచి వ్యక్తులు ఆర్‌బీఐ 19 కార్యాలయాల్లో కరెన్సీని మార్చుకోవడం లేదా సమానమైన మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసుకునే అవకాశం కల్పించారు. అహ్మదాబాద్, బెంగుళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్‌బీఐ కార్యాలయాలకు నోట్లను పోస్ట్‌ చేయడం ద్వారా అకౌంట్‌లో డబ్బలు వేస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రజలు కూడా తమ దగ్గర ఉన్న నోట్లను పోస్ట్‌ ద్వారా స్థానిక ఆర్‌బీఐ కార్యాలయాలకు పంపే అవకాశం కల్పించింది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి