Amazon COD: ఆ సమయం సమీపిస్తుండడంతో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ నోట్లు ఇక స్వీకరించమని ప్రకటన
టీవల కాలంలో భారతదేశంలో రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇచ్చింది. అయితే ప్రముఖ ఆన్‌లైన్ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ తమ వినియోగదారుల నుంచి క్యాష్ ఆన్ డెలివరీలకు ఇప్పటి వరకూ రూ.2000 నోట్లను తీసుకునేది. అయితే రూ.2 వేల నోట్లను మార్చుకునే సమయం దగ్గరకు పడడంతో అమెజాన్ కీలక ప్రకటన చేసింది. అదేంటో ఓ సారి తెలుసుకుందాం.
భారతదేశంలో ఈ-కామర్స్ రంగం విపరీతంగా పెరిగింది. ప్రతి చిన్న వస్తువును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే స్థాయికు చేరుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు విస్తరించాయి. అయితే ఆన్‌లైన్‌లో ప్రొడెక్ట్స్ వస్తాయో? లేదో? అనుమానంతో మొదట్లో ఆన్‌లైన్ ఆర్డర్లకు ప్రజలు భయపడ్డారు. అందువల్ల క్యాష్ ఆన్ డెలివరీ సర్వీసులను తీసుకొచ్చారు. దీంతో క్యాష్ ఆన్ డెలివరీ ఈ-కామర్స్ రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇచ్చింది. అయితే ప్రముఖ ఆన్‌లైన్ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ తమ వినియోగదారుల నుంచి క్యాష్ ఆన్ డెలివరీలకు ఇప్పటి వరకూ రూ.2000 నోట్లను తీసుకునేది. అయితే రూ.2 వేల నోట్లను మార్చుకునే సమయం దగ్గరకు పడడంతో అమెజాన్ కీలక ప్రకటన చేసింది. అదేంటో ఓ సారి తెలుసుకుందాం.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ గురువారం క్యాష్ ఆన్ డెలివరీ సేవలపై రూ.2000 నోట్లను ఆమోదించే అప్‌డేట్‌ను ఇచ్చింది. అమెజాన్ ఎఫ్‌ఏక్యూ క్యాష్ ఆన్ డెలివరీ (COD) చెల్లింపులతో పాటు క్యాష్‌లోడ్‌ల కోసం రూ.2,000 నోట్లు స్వీకరించడాన్ని సెప్టెంబర్ 19 నుంచి నిలిపేస్తామని వివరించింది. థర్డ్-పార్టీ కొరియర్ భాగస్వామి ద్వారా ఉత్పత్తిని డెలివరీ చేస్తే, రూ. 2000 కరెన్సీ నోట్లు ఆమోదిస్తార పేర్కొంది. అయితే, మీ ఉత్పత్తిని థర్డ్-పార్టీ కొరియర్ పార్టనర్ ద్వారా డెలివరీ చేస్తే వారి సొంత పాలసీలకు అనుగుణంగా రూ. 2,000 కరెన్సీ నోట్లు స్వీకరిస్తారని అమెజాన్ తన సైట్‌లో తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19, 2023 నుంచి రూ.2000 నోటును మార్కట్‌లో చలామణి చేయడాన్ని నిషేధించింది. అలాగే రూ.2 వేల నోట్లు ఉన్న పౌరులు వాటిని దగ్గర్లోని బ్యాంకుల ద్వారా సెప్టెంబర్ 30 వరకూ చేసుకోవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పౌరులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నోట్ల మార్చుకోవడానికి చూస్తున్నారు. ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ సమయంలో మే 19న రిజర్వ్ బ్యాంక్ తమ ఉపసంహరణను ప్రకటించిన తర్వాత జూన్ 30 వరకు దేశంలోని పలు బ్యాంకులు రూ.2.72 ట్రిలియన్ల విలువైన రూ.2,000 నోట్లను స్వీకరించాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..