Post Office Net Banking: పోస్టాఫీసు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. ఇందులో తక్కువ మొత్తంతో ఖాతా ఓపెన్ చేయవచ్చు. అంతేకాకుండా ఇందులో చాలా పొదుపు పథకాలు ఉంటాయి. ఇప్పటికే చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టారు. ఎందుకంటే ఇందులో బ్యాంకులో కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకులు మునిగిపోతే కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. కానీ పోస్టాఫీసులో మీ మొత్తం డబ్బుని విత్ డ్రా చేసుకోవచ్చు. మీ డబ్బుకి పూర్తి భద్రత, హామీ ఉంటుంది. అయితే కాలం గడిచే కొద్దీ బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుమార్పులు వచ్చాయి. చిన్న పనికి బ్యాంకుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మనం చేసే పనులన్నీ ఇంట్లో కూర్చొని సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు పోస్టాఫీసు తన కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. మీకు పోస్టాఫీసులో ఖాతా ఉంటే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇలా ఇంటర్‌నెట్ యాక్టివేట్ చేసుకోండి..
ముందుగా మీ ఖాతా ఉన్న పోస్టాఫీసును సందర్శించండి. తర్వాత అక్కడ నెట్ బ్యాంకింగ్ పొందడానికి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పోస్టాఫీసు ఖాతా పాస్‌బుక్ వంటి అన్ని పత్రాలను సమర్పించండి. పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లింక్ వస్తుంది. ఈ లింక్‌పై క్లిక్ చేసి న్యూ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత లాగిన్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, ఇతర లావాదేవీల పాస్‌వర్డ్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని సెట్ చేసుకోవాలి. తర్వాత నెట్ బ్యాంకింగ్ కోసం మిమ్మల్ని అనుమతి అడుగుతుంది. అప్పుడు ID, పాస్‌వర్డ్‌ని సృష్టించడానికి కొన్ని సాధారణ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. ఈ ప్రశ్నలు భద్రతా కోణం నుంచి అని గమనించండి. చివరికి మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ అవుతుంది.