AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎండిపోయిన చెట్టుని అద్భుత బొమ్మగా మలిచిన తీరు అద్భుతం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

Viral Video: ప్రపంచంలో చాలామంది అద్భుత కళాకారులు, నైపుణ్యం గలవారు ఉన్నారు. వీరు చేసే పనుల వల్ల సోషల్‌మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటారు. ఒకరికి గానం బాగుంటే

Viral Video: ఎండిపోయిన చెట్టుని అద్భుత బొమ్మగా మలిచిన తీరు అద్భుతం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..
Art Work
uppula Raju
|

Updated on: Mar 11, 2022 | 11:02 AM

Share

Viral Video: ప్రపంచంలో చాలామంది అద్భుత కళాకారులు, నైపుణ్యం గలవారు ఉన్నారు. వీరు చేసే పనుల వల్ల సోషల్‌మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటారు. ఒకరికి గానం బాగుంటే మరికొందరు నృత్యం బాగా చేస్తారు. వీరి ప్రతిభని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. హ్యాట్సాప్‌ చెబుతారు. తాజాగా ఓ కళాకారుడి నైపుణ్యం వెలుగులోకి వచ్చింది. అతడు ఎండిపోయిన చెట్టుని మనిషి బొమ్మగా మలిచిన తీరు అద్భుతం. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోతారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎండిపోయిన చెట్టుని ఏదో చేయడానికి ప్రయత్నించడం మనం గమనించవచ్చు. తర్వాత చెట్టును కట్‌ చేస్తూ దానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. చివరలో ఆ చెట్టుని అద్భుత బొమ్మగా మలచడం మనం వీడియోలో చూడవచ్చు. చిన్న చిన్న ఉపకరణాలను ఉపయోగించి ఇలాంటి అందమైన కళాకృతిని చేయడం మామూలు విషయం కాదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కళాకారుడని పొగడ్తలతో ముంచెత్తతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఈ వీడియోని ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోతో పాటు క్యాప్షన్‌లో ‘ప్రతి కళాకారుడి మనస్సులో ఒక కళాఖండం ఉంటుంది..!’ అని రాశాడు. నెటిజన్లు కూడా ఈ వీడియోను చాలా ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో బాగా వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన ప్రజలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ దీన్ని సహజ నైపుణ్యంగా అభివర్ణించగా మరొకరు ఇది అద్భుతమైన కళఖండం అని రాశారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

ICC Women World Cup 2022: ప్రపంచకప్‌లో వెనుకబడుతున్న టీమ్‌ ఇండియా.. ఒకటి గెలుపు మరొకటి ఓటమి..

ISI Mark: ఇకనుంచి వాటికి ISI మార్క్.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ణయం..

Zodiac Signs: మార్చి 27 నుంచి ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం