ICICI Bank Interest Rates of FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచిందన ఐసీఐసీఐ.. తాజా వడ్డీ రేట్లు ఇవే..

|

Jan 23, 2022 | 1:06 PM

ICICI Bank Hikes Interest Rates of Fixed Deposits: ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

ICICI Bank Interest Rates of FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచిందన ఐసీఐసీఐ.. తాజా వడ్డీ రేట్లు ఇవే..
Follow us on

ICICI Bank Hikes Interest Rates of Fixed Deposits: ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ, ఆక్సిస్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన దరిమిలా తాజాగా ఐసీఐసీఐ కూడా ఆ జాబితాలో చేరింది. ఇప్పటికే ఎఫ్‌డీ ఖాతాలు కలిగిన వారికి, కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు ఓపెన్ చేసే వారికి ఈ వడ్డీ రేట్లు వర్తించేలా సరికొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది ఐసీఐసీఐ. పెంచిన వడ్డీ రేట్లు జనవరి 20వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్స్‌కి సంబంధించిన చార్ట్‌ను ఐసీఐసీఐ బ్యాంకు తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఖాతాదారులకు ప్రస్తుతం సాధారణ ప్రజలకు 2.50 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7 నుండి 29 రోజుల మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2 కోట్ల రూపాయల కంటే తక్కువ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ లభిస్తుంది. 30 నుండి 90 రోజుల కాలవ్యవధికి.. సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు 3 శాతం, 3.5 శాతం చొప్పున వడ్డీ రేటును అందిస్తుంది. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం బ్యాంక్ 5.45 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ప్లాన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. కాగా, సాధారణ ప్రజలతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది.

జనవరి 20, 2022 నుండి ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

1. 7 రోజుల నుండి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.00 శాతం
2. 15 రోజుల నుండి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.00 శాతం
3. 30 రోజుల నుండి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
4. 46 రోజుల నుండి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
5. 61 రోజుల నుండి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
6. 91 రోజుల నుండి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
7. 121 రోజుల నుండి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
8. 151 రోజుల నుండి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
9. 185 రోజుల నుండి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.90 శాతం
10. 211 రోజుల నుండి 270 రోజులు: సాధారణ ప్రజలకు – 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.90 శాతం
11. 271 రోజుల నుండి 289 రోజులు: సాధారణ ప్రజలకు – 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.90 శాతం
12. 290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.90 శాతం
13. 1 సంవత్సరం నుండి 389 రోజులు: సాధారణ ప్రజలకు – 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.50 శాతం
14. 390 రోజుల నుండి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.50 శాతం
15. 15 నెలల నుండి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.50 శాతం
16. 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.50 శాతం
17. 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.70 శాతం
18. 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.95 శాతం
19. 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.35 శాతం
20. 5 సంవత్సరాలు (80C FD) – గరిష్టంగా 1.50 లక్షల వరకు: సాధారణ ప్రజలకు – 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.95 శాతం

Also read:

Health Tips: టీతో కలిపి వీటిని తీసుకుంటున్నారా.. చాలా డేంజర్ అంటోన్న ఆయుర్వేద నిపుణులు.. అవేంటంటే?

Tom Latham And Daryl Mitchell: మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లాథమ్, మిచెల్.. ఎన్ని పరుగులు చేశారంటే..

Kurnool District: విషాదం.. బైక్‌పై వెళ్తుండగా, తల్లి చేతుల్లో నుంచి జారిపడ్డ 3 నెలల పసివాడు.. చక్రంలో ఇరుక్కుని