ICICI Bank Offers: పండగ సీజన్‌లో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. తక్కువ వడ్డీకే వివిధ రకాల రుణాలు.. పూర్తి వివరాలు..!

|

Oct 13, 2021 | 1:38 PM

ICICI Bank Offers: పండగ సీజన్‌లో వినియోగదారులకు వివిధ బ్యాంకులు ఆఫర్లు కల్పిస్తున్నాయి. హోమ్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, ఇతర లోన్స్‌లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి...

ICICI Bank Offers: పండగ సీజన్‌లో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. తక్కువ వడ్డీకే వివిధ రకాల రుణాలు.. పూర్తి వివరాలు..!
Follow us on

ICICI Bank Offers: పండగ సీజన్‌లో వినియోగదారులకు వివిధ బ్యాంకులు ఆఫర్లు కల్పిస్తున్నాయి. హోమ్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, ఇతర లోన్స్‌లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. అంతేకాకుండా లోన్‌ ప్రాసెసింగ్‌ ఛార్జీలను సైతం తగ్గిస్తున్నాయి. ఇక ప్రముఖ వాణిజ్య బ్యాంకు ఐసీఐసీఐ కస్టమర్లకు దసరా పండుగ సందర్భంగా తన వినియోగదారులకు ఎన్నో ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం పండగ సీజన్‌లో వినియోగదారులకు ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ:

గృహ రుణాలను అతి తక్కువ వడ్డీకే ఐసీఐసీఐ అందిస్తోంది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతాయి. కొత్త గృహ రుణాలు, ఇతర బ్యాంకుల నుంచి రుణాల బ్యాలెన్స్ బదిలీలపై ప్రాసెసింగ్ ఫీజు రూ.1100 నుంచి ప్రారంభం అవుతుంది.

వాహన రుణాలు:

వాహన రుణాల విషయానికి వస్తే.. వినియోగదారులు లక్షకు రూ.799 నుంచి ఈఎంఐ పొందవచ్చు. 8 సంవత్సరాల కాలపరిమితితో రుణాలు అందిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ కారుపై అయితే 10.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కారు రుణంపై టాప్ అప్ రుణం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక ద్విచక్ర వాహన రుణాలు పొందే వారు 48 నెలల కాల వ్యవధితో రూ.1000కి రూ.29 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1499 నిర్ణయించారు.

వ్యక్తిగత రుణాలు:

వ్యక్తిగత రుణాలపై 10.25 శాతం వడ్డీతోపాటు రూ.1999 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ ఉత్పత్తులు, గృహోపకరణాలను కూడా ఈఎంఐపై అందిస్తోంది. కనీసం డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. ఇక వ్యాపారాలు నిర్వహించేవారు రూ.50 లక్షల వరకు ఓడీ సదుపాయం పొందవచ్చని, ఐసీఐసీఐ కస్టమర్ కాని వారు కూడా రూ.15 లక్షల వరకు ఓడీ పొందవచ్చని బ్యాంకు ప్రకటించింది. ఇందులో వినియోగించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ వివరాలన్ని వెబ్‌సైట్ల ఆధారంగా అందించడం జరుగుతుంది. మీరు తీసుకునే రుణం బట్టి మార్పులు ఉంటాయి. పూర్తి వివరాలకు సదరు బ్యాంకును సంప్రదించి తెలుసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

LPG Gas Cylinder: రూ.634కే కొత్త గ్యాస్ సిలిండర్.. ఎంత గ్యాస్‌ ఉందో కూడా తెలుసుకోవచ్చు..!

Big C Festival Offers: పండగ సీజన్‌లో బిగ్‌ సి గుడ్‌న్యూస్‌.. స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు..!