Banks: హోం లోన్‌ గ్రహీతలకు షాక్‌ ఇచ్చిన ఆ బ్యాంక్‌లు.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!

|

Jun 09, 2022 | 4:18 PM

ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు ఆర్పీఐ రేపో రేటును 50 బేస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు జరిగిన మరుసటి రోజే పలు బ్యాంక్‌లు రుణ వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టాయి...

Banks: హోం లోన్‌ గ్రహీతలకు షాక్‌ ఇచ్చిన ఆ బ్యాంక్‌లు.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!
Home Loan
Follow us on

ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు ఆర్పీఐ రేపో రేటును 50 బేస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు జరిగిన మరుసటి రోజే పలు బ్యాంక్‌లు రుణ వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టాయి. ఐసీఐసీఐ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేట్‌ (EBLR)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన రేటు బుధవారం (జూన్‌ 8) నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. దీంతో ఈ బ్యాంకు ఈబీఎల్‌ఆర్‌ (EBLR) రేటు 8.10 శాతం నుంచి 8.60శాతానికి పెరిగినట్లు అయింది. రేపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (BRLLR)ను 7.40శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రకటించింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటుకు అనుసంధానమై ఉండే రుణ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 7.75 శాతం చేసినట్లు ప్రకటించింది. రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (RLLR)ను 6.90శాతం నుంచి 7.40శాతానికి పెంచిన్టలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. పేర్కొంది. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రుణ రేట్లను పెంచేసింది. ప్రస్తుతం 7.25శాతంగా ఉన్న ఆర్‌బీఎల్‌ఆర్‌ (RBLR)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి