Hyundai Verna 2023: హ్యుందాయ్ వెర్నా కొత్త వెర్షన్ ఎలా ఉంటుందో తెలుసా.? వైరల్ అవుతోన్న లీక్‌డ్ ఫొటోలు.
ప్రముఖ కార్ల కంపెనీ హ్యూందాయ్‌కి చెందిన వెర్నా ఎంతటి పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ కారు రికార్డు అమ్మకాలతో సంచలనం సృష్టించింది. ఇదిలా తాజాగా వెర్నాకు లేటెస్ట్ వెర్షన్‌ను..
ప్రముఖ కార్ల కంపెనీ హ్యూందాయ్‌కి చెందిన వెర్నా ఎంతటి పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ కారు రికార్డు అమ్మకాలతో సంచలనం సృష్టించింది. ఇదిలా తాజాగా వెర్నాకు లేటెస్ట్ వెర్షన్‌ను తీసుకొస్తోంది హ్యూందాయ్. 2023 వెర్నా మోడల్‌ను భారత్‌లో త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు ప్రీబుకింగ్స్ సైతం స్వీకరిస్తోంది సంస్థ. అయితే ఇప్పటి వరకు ఈ కారు లుక్స్ విషయంలో కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే తాజాగా ఈ మిడ్-సైజ్ సెడాన్ ఇటీవల టెస్టింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ ఫొటోలను చూస్తుంటే.. ఆధునిక డిజైన్‌తో రూపొందించినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ కలిగి, పారామెట్రిక్ గ్రిల్ అందించారు. ఫ్రంట్ బంపర్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. బోనెట్ మీద హ్యూందయ్ లోగోను అందించారు. సైడ్ ప్రొఫైల్‌లో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఇంటీరయర్ డిజైన్, ఫీచర్స్ వంటివి తెలియాలంటే కంపెనీ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్స్‌తో రానుంది. 1.5 లీటర్ ఇంజన్‌తో కూడిన కారు115 పిఎస్ పవర్ & 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్, ఇది 160 పిఎస్ పవర్ & 265 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కారు ధర, ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందన్న వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..