Hyderabad: దేశంలో రియల్‌ ఎస్టేట్‌ జోరు.. మూడో స్థానంలో హైదరాబాద్‌.. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక

|

Jan 12, 2023 | 3:26 PM

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పుంజుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నగరంలో కూడా రియల్‌ ఎస్టేట్‌ జోరందుకుంది. గత ఏడాది హైదరాబాద్‌ స్థిరాస్తి విభాగంలో..

Hyderabad: దేశంలో రియల్‌ ఎస్టేట్‌ జోరు.. మూడో స్థానంలో హైదరాబాద్‌.. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక
Hyderabad Real Estate
Follow us on

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పుంజుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నగరంలో కూడా రియల్‌ ఎస్టేట్‌ జోరందుకుంది. గత ఏడాది హైదరాబాద్‌ స్థిరాస్తి విభాగంలో వాణిజ్య స్థలం వినియోగం 12 శాతం పెరిగిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం 67 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని కంపెనీలు అద్దెకు తీసుకున్నట్లు పేర్కొంది.

దీని ద్వారా దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కమర్షియల్‌ స్థలానికి ఐటీ కంపెనీల నుంచి ఎక్కువ గిరాకీ లభిస్తున్నా, ఇటీవల కాలంలో ఇతర రంగాల కంపెనీలు అద్దెకు తీసుకోవడం చాలా పెరిగింది. కో వర్కింగ్‌, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగాల కంపెనీలు ఇందులో ముందున్నాయని తెలిపింది. హైదరాబాద్‌లో చదరపు అడుగుల నిర్మాణ స్థలానికి సగటు అద్దె రూ.65గా ఉందని, 2021 సంవత్సరంతో పోలిస్తే 6 శాతం అధికమని తెలిపింది.

నివాస గృహాలలో..

ఇక నివాస గృహాల విషయానికొస్తే 2021లో హైదరాబాద్‌లో 43,847 కొత్త ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, 31,046 కొత్త ఇళ్ల అమ్మకాలు నమోదు అయ్యాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ఇక 2021తో పోలిస్తే కొత్త ఇళ్ల నిర్మాణంలో 22.7 శాతం ఇళ్ల అమ్మకాలలో 27.7 శాతం వృద్ధి నమోదైంది. నివాస గృహాల చదరపు అడుగుల సగటు ధర 2021తో పోలిస్తే 5.6 శాతం అధికమై రూ.4,984కు చేరింది.

ఇవి కూడా చదవండి

నగరంలోని హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, కూకట్‌పల్లి, రాయదుర్గం, మణికొండ తదితర ప్రాంతాల్లో కార్యాలయాల గిరాకీ కూడా బాగానే ఉంది. ఇక నివాసల విషయానికొస్తే.. గండిపేట, తెల్లాపూర్‌, కొల్లూరు, నార్సింగ్‌లలో ఆదరణ ఎక్కువగా ఉంది. ఇక్కడ కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే హైదరాబాద్‌ స్థిరాస్తి విభాగంలో ఐటీ రంగమే ఒక ఇంధనంగా ఉందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా హైదరాబాద్‌ బ్రాంచ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ శామ్సన్‌ ఆర్థర్‌ తెలిపారు.

నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో 8 ప్రధాన నగరాలు:

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దేశంలో 8 ప్రధాన నగరాలు ఉన్నాయి. అవి ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ నగరాల స్థిరాస్తుల సమాచారంతో నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదికను రూపొందించింది. గత ఏడాదిలో కార్యాలయాల స్థలాల అమ్మకాలు 36 శాతం, నివాస గృహాల అమ్మకాలు 34 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..