Pilots: భారతదేశంలో పైలెట్స్‌కు యమా డిమాండ్.. విమానయాన శాఖ మంత్రి చెప్పేది వింటే షాక్..!
భారతదేశంలో విమానా ప్రయాణాలు చేసే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ముఖ్యంగా సమయాన్ని ప్రయాణ సమయంలో వృథా చేయకూడదనే వాళ్లు ముందుగా విమానా ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పైలెట్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ మేరకు విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు స్పందించారు. పైలెట్స్ విషయంలో రామ్మోహన్‌నాయుడు చెప్పిన కీలక విషయాలను తెలుసుకుందాం.

దేశీయ విమానయాన సంస్థలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్నందున రాబోయే 15-20 సంవత్సరాలలో భారతదేశానికి 30,000 మంది పైలెట్లు అవసరం అవుతుందని పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశీయ విమానయాన సంస్థలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్నందున 1,700 కంటే ఎక్కువ విమానాలను ఆర్డర్ చేశాయని స్పష్టం చేశారు. దేశంలో విమానయాన పరిశ్రమ కోసం మంత్రిత్వ శాఖ ఒక సమిష్టి విధానంతో పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అధికారులు 38 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్‌కు సంబంధించిన వివిధ అంశాలను ధ్రువీకరిస్తున్నారని, అలాగే ఈ సంస్థలకు రేటింగ్ ఇస్తున్నారని వివరించారు.
200 శిక్షణ విమానాల ఆర్డర్ కోసం అవగాహన ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తన అభిప్రాయాలను వెల్లడించారు. భారతీయ విమానయాన సంస్థలు 1,700కు పైగా విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని. ప్రస్తుతం 800కు పైగా విమానాలు ఉన్నాయని నాయుడు చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఆరు వేల నుంచి ఏడు వేల మంది పైలెట్లు పనిచేస్తున్నారని రాబోయే 15 నుంచి 20 సంవత్సరాలలో దేశానికి 30,000 మంది పైలట్లు అవసరమవుతారని స్పష్టం చేశారు.
ముఖ్యంగా భారతదేశాన్ని పైలెట్స్ శిక్షణా కేంద్రంగా మార్చాలని కూడా యోచిస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటిగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో విమానాశ్రయాలను వర్గీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. వీటిలో కార్గో, ఎఫ్‌టీఓల కోసం ప్రత్యేక విమానాశ్రయాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..