Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Battery Charging: మీ ఫోన్ బ్యాటరీను ఫుల్‌గా చార్జ్ చేస్తున్నారా? ఆ సమస్యలు తప్పవంతే..!

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి కుటుంబంలో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే వాటి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారులను తరచూ చార్జింగ్ సమస్య వేధిస్తుంది. అందువల్ల చాలా మంది తమ ఫోన్ బ్యాటరీ ఎల్లప్పుడూ వంద శాతం చార్జ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా చేయడం చాలా తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Battery Charging: మీ ఫోన్ బ్యాటరీను ఫుల్‌గా చార్జ్ చేస్తున్నారా? ఆ సమస్యలు తప్పవంతే..!
Smart Phone Battery Charging
Follow us
Srinu

|

Updated on: Mar 13, 2025 | 3:11 PM

ఇటీవల కాలంలో రిలీజ్ చేసే చాలా స్మార్ట్‌ఫోన్‌లు నాన్ రిమూవబుల్ బ్యాటరీలతో వస్తున్నాయి. గతంలో కీ ప్యాడ్ ఫోన్లు ఉండే సమయంలో చాలా మంది ఎక్స్‌ట్రా బ్యాటరీ క్యారీ చేసేవారు. ఇప్పుడు ఆ సదుపాయం లేకపోవడంతో ఎక్కువ మంది తమ ఫోన్‌లో ఎల్లప్పుడూ 100 శాతం బ్యాటరీ చార్జ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా చేయడం చాలా నష్టం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ హెల్త్‌ పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు మన్నాలంటే చార్జింగ్‌ను 80 శాతానికి పరిమితం చేయాలని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చే స్మార్ట్ ఫోన్స్‌లో బ్యాటరీను 80 శాతానికే పరిమితం చేసేలా ప్రత్యేక సెట్టింగ్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఈ సెట్టింగ్స్‌ ఆన్ చేస్తే బ్యాటరీ జీవితకాలం మెరుగపడడమే కాక పనితీరు కూడా మెరుగుపడుతుంది.

అయితే కొత్తగా ఫోన్ కొన్న వారు బ్యాటరీ చార్జ్‌ను కేవలం 80 శాతానికి పరిమితం చేయడం ఏంటనే ఆలోచనలో ఉంటారు. అయితే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు పూర్తి సామర్థ్యాన్ని కోల్పోవడానికి హీట్, వోల్టేజ్ ప్రధాన కారణాలుగా ఉంటాయి. వినియోగదారులు తమ ఫోన్‌ను టేబుల్‌పై పెట్టి చార్జింగ్ పెట్టే సమయంలో హీట్ సమస్య వస్తుంది. అయితే వోల్టేజ్ విషయం అనేది బ్యాటరీను చార్జ్ చేసే సమయంలో వచ్చే కరెంట్ బట్టి ఉంటుంది. ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ మొదటి 60 శాతం ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీ వోల్టేజీలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు అవి నెమ్మదిస్తాయి. అయితే మీరు తరచుగా మీ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఆరోగ్యాన్ని వేగంగా క్షీణించే అవకాశం ఉంది. బ్యాటరీ ఛార్జ్‌ను పరిమితం చేసేటప్పుడు బ్యాటరీ గరిష్ట వోల్టేజ్‌లో లేనందున బ్యాటరీ ఛార్జ్‌ను 80 శాతానికి పరిమితం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

లేటెస్ట్  ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో బ్యాటరీ ఛార్జింగ్‌ను 80 శాతానికి పరిమితం చేసే అంతర్నిర్మిత సెట్టింగ్స్ ఉంటున్నాయి. సామ్‌సంగ్ ఫోన్స్ ఈ ఆప్షన్‌ను ‘బ్యాటరీ ప్రొటెక్షన్’ వద్ద కనుగొనవచ్చు. అయితే వన్ ప్లస్ ఫోన్స్‌లో అయితే ‘బ్యాటరీ హెల్త్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఐఫోన్ ఉంటే ఆప్టిమైజ్ చేసిన బ్యాటరీ ఛార్జింగ్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది అయితే ముందుగా సెట్టింగ్స్‌కు వెళ్లి బ్యాటరీను ఎంచుకుని, అనంతరం చార్జింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని ముందుగా సెట్ చేసిన ఛార్జ్ పరిమితిని పరిశీలించి మనకు కావాల్సిన పరిమితిని సెట్ చేసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..