కష్టపడి సంపాదించిన సొమ్మును ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలని అందరూ అనుకుంటారు. అలా రిస్క్ లేకుండా బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీపై కాలం గడుపుతుంటారు. అయితే ఇలాంటి వారిని ఆకట్టుకోడానికి బ్యాంకులు కూడా ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాదారులకు వడ్డీ రేటు పెంపును ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ జాబితాలో హెచ్ ఎస్ బీసీ బ్యాంకు కూడా చేరింది. రూ.2 కోట్ల లోపు దేశీయ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ ను పెంచుతున్నట్లు బ్యాంక్ వెబ్ సైట్ లో ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 19 2022 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 60 నెలల వరకు మెచ్యూరయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను సాధారణ ప్రజలకు 2.85 శాతం నుంచి 6.00 శాతం వరకు పెంచింది. సీనియర్ సిటిజన్‌లకు 3.35 శాతం నుంచి 6.50 శాతం వరకు అందిస్తుంది. 36 నెలల నుంచి 37 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ప్రస్తుతం సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 7 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే 7 నుంచి 8 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, బ్యాంక్ 2.85 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 9 నుంచి 29 రోజులలో మెచ్యూరయ్యే డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 30 నుంచి 59 రోజులకు 3.40 శాతం, 60 నుంచి 89 రోజులలో మెచ్యూరయ్యే ఎఫ్ డీల కోసం 3.60 శాతం అందిస్తుంది. అలాగే 90 నుంచి 94 రోజుల ఎఫ్ డీలపై 3.80 శాతం, 95 నుంచి 179 రోజుల మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ 4.00 శాతం చొప్పున చెల్లిస్తుంది.
అయితే వడ్డీ రేట్ సవరణ ఎక్కువ రోజుల ఎఫ్ డీల్లో పెట్టుబడి వారికే లాభం చేకూరుస్తుంది. 701 నుండి 731 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ లభిస్తుంది. 732 రోజుల నుండి 36 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూరయ్యే డిపాజిట్లకు 6.50 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా, 36 నెలల నుంచి 37 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూరయ్యే డిపాజిట్లకు 7.00 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ 37 నుంచి 60 నెలల వరకు మెచ్యూరిటీలతో FDలపై 6.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్కువ రానుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..