UPI PIN: డెబిట్ కార్డ్ లేకుండా యూపీఐ పిన్‌ని ఎలా సెట్ చేయాలి..?

UPI PIN: యూపీఐ చెల్లింపు చేయడానికి వినియోగదారు తన మొబైల్‌ను ప్రామాణీకరించాలి. దాని కోసం అతనికి డెబిట్ కార్డ్ అవసరం. ఇప్పుడు కార్డ్ లేని వినియోగదారులు యూపీఐని సెట్ చేయవచ్చు..

UPI PIN: డెబిట్ కార్డ్ లేకుండా యూపీఐ పిన్‌ని ఎలా సెట్ చేయాలి..?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 30, 2024 | 9:26 AM

UPI పిన్- నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI సర్వీసులను అందిస్తుంది. యూపీఐలో అన్ని మార్పులు, అప్‌డేట్‌లు NPCI ద్వారా మాత్రమే అమలు అవుతాయి. అదే విధంగా ఎన్‌పీసీఐ ఇప్పుడు డెబిట్ కార్డ్ లేకుండా UPI PINని సెట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. UPI చెల్లింపు సులభంగా చేస్తోంది. యూపీఐ డిజిటల్ చెల్లింపులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. దాని సహాయంతో వినియోగదారు ఏ విక్రేతకైనా సులభంగా చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు చేయడానికి వినియోగదారు తప్పనిసరిగా తన స్వంత బ్యాంక్ ఖాతాతో పాటు డబ్బు పంపే వినియోగదారు యూపీఐ ఐడీ ఉండాలి.

యూపీఐ చెల్లింపు చేయడానికి వినియోగదారు తన మొబైల్‌ను ప్రామాణీకరించాలి. దాని కోసం అతనికి డెబిట్ కార్డ్ అవసరం. ఇప్పుడు కార్డ్ లేని వినియోగదారులు యూపీఐని సెట్ చేయవచ్చు.

మీరు యూపీఐ పిన్‌ను రెండు మార్గాల్లో సెట్ చేయవచ్చు. వినియోగదారులు తమ యూపీఐని రెండు మార్గాల్లో సెట్ చేయవచ్చు. ఒక డెబిట్ కార్డ్, మరొకటి ఆధార్ కార్డ్ (OTP). ఆధార్ కార్డ్ ద్వారా పిన్ సెట్ చేయడానికి వినియోగదారు ఆధార్‌ను అతని మొబైల్ నంబర్‌కు లింక్ చేయడం అవసరం. అలాగే యూపీఐ యూజర్ మొబైల్ నంబర్ కూడా బ్యాంక్‌లో నమోదై ఉండాలి.

ఆధార్ కార్డ్ ద్వారా యూపీఐ పిన్ సెట్ చేసే విధానం:

1. ముందుగా యూపీఐ అప్లికేషన్‌ను ఓపెన్‌ చేసి మీ బ్యాంక్ ఖాతాను జోడించుపై క్లిక్ చేయండి.

2. తదుపరి స్లయిడ్‌లో సెట్ యూపీఐ పిన్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

3 . యూపీఐ అప్లికేషన్‌లో దీన్ని చేయడానికి రెండు ఆప్షన్లు ఉంటాయి. డెబిట్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ద్వారా. ఆధార్ ఎంపికను ఎంచుకున్న తర్వాత మీరు మీ సమ్మతిని ఇవ్వాలి.

4. చివరగా మీరు మీ ఆధార్‌లోని మొదటి 6 అంకెలను నమోదు చేయాలి. ఆ తర్వాత నిర్ధారించండి.

చివరగా ఓటీపీని నమోదు చేయండి.

పైన పేర్కొన్న అన్ని దశలను పూర్తి చేసిన తర్వాత, రిజిస్టర్డ్ నంబర్‌లో అందుకున్న ఓటీపీనిని నమోదు చేయండి. మీరు ఎంటర్ చేసిన వెంటనే, తదుపరి పేజీలో UPI PINని సెట్‌ అయినట్లు కనిపిస్తుంది.