Fixed Deposit: బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి…?

| Edited By: Ram Naramaneni

Apr 17, 2021 | 8:40 AM

Fixed Deposit: ప్రస్తుత కాలంలో బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే వారు తిరిగి చెల్లిస్తారో లేదో అనే బెంగ ఉంటుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఏం వస్తాయి అని భావించే వాళ్లు స్థిర

Fixed Deposit: బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి...?
Follow us on

Fixed Deposit: ప్రస్తుత కాలంలో బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే వారు తిరిగి చెల్లిస్తారో లేదో అనే బెంగ ఉంటుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఏం వస్తాయి అని భావించే వాళ్లు స్థిర డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతారు. కొన్ని బ్యాంకులలో ఎక్కువ వడ్డీ వస్తుంది. మరి కొన్ని బ్యాంకులలో తక్కువ వడ్డీ వస్తుంటుంది. ఎందుకంటే ఇవి స్థిరమైన రాబడి, మూలధనం భద్రతకు హామీ ఇస్తుంది. అయినప్పటికీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. కొన్ని బ్యాంకులు కస్టమర్ల కోరిక మేరకు ఎఫ్‌డీలపై టీడీఎస్‌ను కొంత వరకు తగ్గిస్తాయి. బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి…? అనే విషయాలను తెలుసుకుందాం.

ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే మీరు సంపాదించిన వడ్డీపై టీడీఎస్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. వివిధ ఎఫ్‌డీలపై బ్యాంకులు 10 శాతం చొప్పున టీడీఎస్‌ను తగ్గించుకొంటాయి. అయితే ఖాతాదారుడు పాన్‌కార్డు నెంబర్‌ జత చేసిన తర్వాత అతనికి ట్యాక్స్‌లో రాయితీ కల్పిస్తారు. ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నదని బ్యాంకుకు తెలియజేయాలి. ఫారం 15జీ లేదా 15 హెచ్‌ను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇవి సెల్స్‌ డిక్లరేషన్‌ ఫారాలు. దీనిలో మీ ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నదని తగిన ఆధారాలు సమర్పించాలి. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ.2.5 లక్షల లోపు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది.

60 ఏళ్ల వయసు పైబడిన వారు, 80 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది. 80 ఏళ్ల వయసు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఇస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్‌ను నివారించడానికి మీరు ఇప్పుడు ఫారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల టీడీఎస్‌ను తగ్గించుకోవచ్చు.

ఇవీ చదవండి: Covid-19: కరోనా నుంచి రక్షించుకునేందుకు కొత్త పాలసీలు..5 లక్షల వరకు కవరేజీ.. ప్రీమియం ఎంతంటే..!

SBI Insurance: కస్టమర్లకు శుభవార్త.. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల లైఫ్‌ కవరేజీతో ఇన్సూరెన్స్‌

Broadband Plans: పెరిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు..అధిక స్పీడుతో ఇంటర్నెట్‌ సేవలు… ఏ నెట్‌వర్క్‌కు ఎంత ప్యాకేజీ..