Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో..

|

Mar 21, 2021 | 11:25 AM

Google Pay App FASTag: కేంద్ర ప్రభుత్వం వాహనదారుల టోల్‌ కస్టాలను తొలగించేందుకు కొత్త కొత్త మార్పులు అందుబాటులోకి తీసుకువస్తోంది. టోల్‌ చార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం..

Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో..
Google Pay App Fastag
Follow us on

Google Pay App FASTag: కేంద్ర ప్రభుత్వం వాహనదారుల టోల్‌ కస్టాలను తొలగించేందుకు కొత్త కొత్త మార్పులు అందుబాటులోకి తీసుకువస్తోంది. టోల్‌ చార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం ఫాస్టాగ్స్‌ను తప్పనిసరి చేసింది. టోల్‌గేట్ల వద్ద గంటల తరరబడి వేచి ఉండటం వల్ల వాహనాల రద్దీ ఎక్కువైపోతోంది. దీంతో సమయం వృథా అవుతోంది. దీంతో కార్లు, బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా ఫాస్టాగ్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. టోల్‌ ప్లాజాల వద్ద ఆగకుండా టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గానే కట్ అవుతాయి. దీంతో మీరు వాహనాన్ని నిలిపి చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. ఆగకుండా డైరెక్ట్‌గా వెళ్లిపోవచ్చు. వాహనం అద్దంపై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ ద్వారా టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌ నుంచి కట్ అవుతాయి.

ఇక ఫాస్టాగ్స్‌ వినియోగదాఉల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్‌ ఖాతాను సులభంగా రీఛార్జ్‌ చేసుకునేందుకు ప్రత్యేక యానిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేజ్‌ (UPI) సదుపాయాన్ని యాప్‌ ద్వారా ప్రాంరభించింది. గూగుల్‌ పేకు ఫాస్టాగ్‌ ఖాతాను లింక్‌ చేసుకుని రీఛార్జ్‌ చేసుకోవడంతో పాటు పేమెంట్‌ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే గూగుల్‌ పే ద్వారా రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే వినియోగదారులు యాప్‌లోని బిల్‌ పేమెంట్‌ సెక్షన్‌ కింద ఉండే ఫాస్టాగ్‌ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మన ఫాస్టాగ్‌ జారీ చేసిన బ్యాంకును ఎంచుకోవాలి. ఆ తర్వాత వెహికల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి బ్యాంకు ద్వారా పేమెంట్‌ చేయవచ్చని అధికారులు తె లిపారు. కాగా, గూగుల్‌ పే నుంచి ఫాస్ట్‌ ట్యాగ్‌ రీఛార్జ్‌ చేయడానికి మీరు గూగుల్‌ పే అకౌంట్‌ను ఉపయోగించాలి. ఇది యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ)తో అనుసంధానం చేయబడుతుంది. గూగుల్ పేయాప్‌ ద్వారా ఫాస్ట్‌ ట్యాగ్‌ అకౌంట్‌ రీఛార్జ్‌ చేయడమే కాకుండా పేమెంట్‌ రికార్డులను కూడా చేసుకోవచ్చు.

మీ ఫాస్టాగ్ అకౌంట్‌ను ఎలా లింక్‌ చేసుకోవాలి..?

– ముందుగా మీ ఫోన్‌లో గూగుల్‌ పే యాప్‌ ఓపెన్‌ చేయాలి.
– తర్వాత న్యూ పేమెంట్‌పై క్లిక్‌ చేయాలి.
– కింద సూచించిన ఆప్షన్లలోకి వెళ్లి మోర్‌పై క్లిక్‌ చేయాలి. గూగుల్‌ పే యాప్‌ కనిపించకపోతే మళ్లీ మోర్‌ ఆప్షన్‌పై నొక్కాలి.
– అక్కడ ఫాస్టాగ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని తర్వా ఫాస్టాగ్‌ జారీ చేసే బ్యాంకు ఎంచుకుని మీ కారు నెంబర్‌ అందులో ఎంటర్ చేయాలి. దీని తర్వాత మీరు గూగుల్‌ యాప్‌ ద్వారా ఫాస్టాగ్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. అయితే మీరు ఐసీఐసీ బ్యాంకు నుంచి ఫాస్టాగ్‌ కొనుగోలు చేస్తే మీకు 200 రూపాయల ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ.100 క్యాష్‌ బ్యాక్‌, రూ.100 అమెజాన్‌ గిఫ్ట్‌ వోచర్‌ అందిస్తుంది.

ఇవీ చదవండి :

Sukanya Samriddhi PPF: సుకన్య సమృద్ధి యోజన పథకం.. పీపీఎఫ్‌లలో ఏది బేటర్‌.. రెండింటిలో తేడాలు ఏమిటీ..?

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?