సాధారణంగా చాలా మంది తమ డబ్బులను బ్యాంకులలో దాచుకుంటుంటారు. అలాగే మరికొంత మంది ఇన్సూరెన్స్, ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో డబ్బులను పొదుపు చేస్తుంటారు. అయితే ఇన్ని రకాలుగా డబ్బులను దాచుకోవడానికి ప్రధాన కారణం భవిష్యత్ లక్ష్యాల కోసం ఇలా చేస్తుంటారు. ఇక ఇందులో చాలావరకు ఫిక్స్ డ్ డిపాజిట్ ద్వారా డబ్బులను పొదుపు చేస్తుంటారు. అయితే ఆకస్మాత్తుగా వారు మరణిస్తే.. ఆ డబ్బులను ఎలా విత్ డ్రా చేయాలి ? ఒకవేళ నామినీ లేకపోతే ఆ డబ్బులు ఎవరికి చెందుతుందో తెలుసుకుందామా…
నామినీ పేరు ఉండి.. ఒక వ్యక్తి పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ ఉండి.. వారు మరణిస్తే.. ఆ డబ్బులు నామినీ వ్యక్తికి చెందుతాయి. కానీ ఇందుకోసం చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ పేరు లేకపోతే అప్పుడు వారసత్వ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా.. ఒక జాయింట్ అకౌంట్ ఉండి… అందులో ఒకరు మరణిస్తే మిగిలిన వారికి ఆ డబ్బులు అందుతాయి. అనుకోని సందర్భాల్లో జాయింట్ అకౌంట్ ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణిస్తే.. అప్పుడు నామినీకి డబ్బులు అందిస్తారు. ఇక ఇందులో కూడా నామినీ లేకపోయినట్లయితే వారి వారసులకు డబ్బులు అందుతాయి. అందువల్ల బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు మరణిస్తే.. అప్పుడు నామినీకి అందులో ఉన్న డబ్బులను తీసుకునే అధికారం ఉంటుంది. బ్యాంక్ నామినీకే డబ్బులను అందిస్తుంది. నామినీ లేకపోతే వారసులకు ఆ డబ్బులు లభిస్తాయి. అందువల్ల అకౌంట్ కలిగిన వారు నామినీని రిజిస్టర్ చేసుకోవాలి.
కస్టమర్లకు అలర్ట్… పోస్టాఫీస్ వర్క్ టైమింగ్స్ మారాయి..రోజుకూ కొన్ని గంటలే పనిచేయనున్న కార్యాలయాలు..