AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Gold: బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారా? ఫోన్‌పేలో ఇలా చేయండి చాలు!

బంగారం కొనాలని అందరికీ ఉంటుంది. అయితే పెరుగుతున్న గోల్డ్ రేట్లను దృష్టిలో ఉంచుకుని చాలామంది వెనకడుగు వేస్తారు. అయితే బంగారం రేట్లతో సంబంధం లేకుండా మీ దగ్గర ఎంత ఉంటే అంత మొత్తంతో బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Digital Gold: బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారా? ఫోన్‌పేలో ఇలా చేయండి చాలు!
Digital Gold
Nikhil
|

Updated on: Oct 03, 2025 | 6:58 PM

Share

నేరుగా బంగారాన్ని కొనలేని వాళ్లు డిజిటల్ గోల్డ్ అనే ఆప్షన్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చని మీకు తెలుసా? నిజమే. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే డిజిటల్ గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని వాల్యూ నిజమైన బంగారం రేట్లకు అనుగుణంగా మారుతుంటుంది. అయితే ఈ డిజిటల్ గోల్డ్ ను సింపుల్‌గా ఫోన్‌లోనే కొనుగోలు చేయొచ్చు! మీకు ఫోన్‌పే అకౌంట్ ఉంటే చాలు. యాప్ ద్వారా మీరు డిజిటల్‌ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడం, అమ్మడం వంటివి చేయొచ్చు. పైగా పెట్టుబడి పెట్టే ప్రాసెస్ కూడా చాలా సింపుల్.

ప్రాసెస్ ఇదే..

బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్‌‌తో మీ ఫోన్‌పే అకౌంట్ సెటప్ చేసిన తర్వాత ఫోన్‌పే హోమ్ పేజీలో డిజిటల్ గోల్డ్ అనే బాక్స్ అనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. డైలీ సేవింగ్స్, బయ్ డిజిటల్ గోల్డ్, గోల్డ్ లోన్, మంత్లీ గోల్డ్ సిప్ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో బయ్ డిజిటల్ గోల్డ్ పై క్లిక్ చేసి.. మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ను ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేయగానే పక్కన దానికి సమానమైన బంగారం వెయిట్ కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు రూ.500 ఎంటర్ చేస్తే.. అక్కడ 0.0401 గ్రాములు అని చూపిస్తుంది. ఇది బంగారం ధరను బట్టి మారుతుంది. తర్వాత ప్రొసీడ్ నొక్కి పేమెంట్ చేస్తే చాలు. మీరు బంగారం సొంతం చేసుకున్నట్టే. ఫోన్‌పే ప్రకారం ఈ ఫీచర్‌ని ఉపయోగించి పెట్టుబడి పెట్టడానికి 45 సెకన్లు మాత్రమే పడుతుంది. తక్కువ టైమ్ లో, వేగంగా, సౌకర్యవంతంగా బంగారం కొనుగోలు చేసేలా ఈ ప్రాసెస్ రూపొందించారు

ఇవి కూడా..

ఇకపోతే ఈ డిజిటల్ బంగారాన్ని అమ్మడం కూడా చాలా సులభం. మీరు ఆల్రెడీ బంగారాన్ని కొని ఉంటే అక్కడే సెల్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దానపై క్లిక్ చేసి అప్పుడు ఉన్న రేటుకి అమ్మేయొచ్చు. ఇక వీటితోపాటు మంత్లో గోల్డ్ సిప్ ద్వారా ప్రతినెలా డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మీరు కొన్న గోల్డ్‌పై లోన్ కూడా తీసుకోవచ్చు.

అన్నింటికంటే ముఖ్యంగా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మారుతున్న మార్కెట్ ధరలను గమనించడం ముఖ్యం. తక్కువ ఉన్నప్పుడు కొనడం, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మడం చేయడం ద్వారా నష్టపోకుండా చూసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..