Kisan Credit Card: రైతులకూ క్రెడిట్ కార్డు.. సులభంగా రుణాలు.. పొదుపు కూడా చేసుకోవచ్చు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటాయి. పలు పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందిస్తుంటాయి. అటువంటి పథకాల్లో కేంద్ర ప్రభుత్వం అందించే కిసాన్ యోజన ఒకటి. ఇదే క్రమంలో రైతులపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. దీని సాయంతో రైతులు తమ వ్యవసాయ అవసరాలకు సులభంగా రుణాలు పొందొచ్చు.

Kisan Credit Card: రైతులకూ క్రెడిట్ కార్డు.. సులభంగా రుణాలు.. పొదుపు కూడా చేసుకోవచ్చు..
Kisan Credit Card

Edited By:

Updated on: Dec 06, 2023 | 9:50 PM

మన దేశం ప్రధానంగా వ్యవసాయాధారితమైనది. రైతులు క్షేమంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. అందుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటాయి. పలు పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందిస్తుంటాయి. అటువంటి పథకాల్లో కేంద్ర ప్రభుత్వం అందించే కిసాన్ యోజన ఒకటి. ఇదే క్రమంలో రైతులపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. దీని సాయంతో రైతులు తమ వ్యవసాయ అవసరాలకు సులభంగా రుణాలు పొందొచ్చు. ఈ నేపథ్యంలో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా దరఖాస్తు చేయాలి? దానిలో ప్రయోజనాల గురించి ఇప్పడు తెలుసుకుందాం..

కిసాన్ క్రెడిట్ కార్డు..

నేషనల్ బ్యాంకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి(నాబార్డ్) కోసం ఈ క్రెడిట్ కార్డు విధానాన్ని తీసుకొచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డు సాయంతో రుణం పొందుకోవడంతో పాటు పొదుపు ఖాతా తరహా సేవలను అందిస్తుంది. దేశ వ్యాప్తంగా రైతులకు ఇది అందుబాటులో ఉంది. కౌలు రైతులు, భూ యజమానులు, షేర్ క్రాపర్ రైతులు అందరూ ఈ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి భరోసా ఉంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు ప్రక్రియ..

కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే కార్డు మంజూరవుతుంది. పీఎం కిసాన్ యోజన్ లబ్ధిదారులు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలు పొందుతారు. దరఖాస్తు ఎలా చేయాలంటే..

ఇవి కూడా చదవండి
  • కిసాన్ క్రెడిట్ కార్డు మంజూరు చేసే ఏదైనా జాతీయ బ్యాంకు వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  • అక్కడ కిసాన్ కార్డు ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • దానిలో అడిగిన అన్ని వివరాలు పూరించి, సబ్మిట్ చేయాలి.
  • అప్పుడు మీ దరఖాస్తు ప్రాసెస్ చేస్తారు.
  • అన్ని అర్హతలూ ఉంటే ప్రాసెస్ చేసిన 15 రోజులకు కార్డు మంజూరు చేస్తారు.

బహుళ ప్రయోజనాలు..

ఈ కార్డుతో రెండు రకాల ప్రయోజనాలు రైతులు పొందుతారు. సాగు కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా క్రెడిట్ సాయంతో పెట్టుబడిని రుణ రూపంలో పొందొచ్చు. వాటిని ఒకేసారి చెల్లించొచ్చు.. లేదా సులభ వాయిదాలలో చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. ఇది రైతులకు వెసులుబాటును కల్పిస్తుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డు సాయంతో సేవింగ్స్ ఖాతాను కూడా ప్రారంభించొచ్చు. అవసరం అయినప్పుడు వేర్వేరు అకౌంట్లు కాకుండా ఒకే ఖాతాలో నగదు పొదుపు చేయడంతో పాటు రుణాలు కూడా పొందొకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..