AC Usage: పెరుగుతున్న ఎండలు.. ఏసీ వాడకంతో కరెంట్ బిల్లు ఎంత వస్తుందంటే?
భారతదేశంలో ఇటీవల కాలంలో ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకే బానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏసీల వినియోగం బాగా పెరుగుతుంది. అయితే సగటు మధ్యతరగతి ఉద్యోగికి పెరుగుతున్న కరెంట్ బిల్లు ఆందోళనకు గురి చేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో 1.5 టన్ ఏసీలను ఓ ఎనిమిది గంటల పాటు వాడితే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో? తెలుసుకుందాం.

వేసవి నుంచి ఉపశమనం అందించడంలో ఎయిర్ కండిషనర్లు (ఏసీ)లు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అయితే వీటిని కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే వీటిపి తరచూ వాడితే కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. అందువల్ల చాలా మంది ప్రజలు ఎయిర్ కండిషనర్ కొనాలనుకున్నా కొంత వెనుకాడతారు. సాధారణంగా ఇళ్లలో 1.5 టన్నుల ఏసీని ఏర్పాటు చేస్తారు. అయితే కరెంటు బిల్లు అనేది ఏసీ స్టార్ రేటింగ్‌పై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో అత్యధికంగా1.5 టన్నుల ఏసీలు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లోని చిన్న, మధ్య తరహా గదుల కోసం 1.5 టన్ను ఏసీ ఉత్తమమైనదిగా ప్రజలు భావిస్తూ ఉంటారు. అయితే 1.5 ఏసీ అమర్చిన తర్వాత విద్యుత్ బిల్లు ఎంత అవుతుందో? చాలా మందికి తెలియదు కాబట్టి మీరు 1.5 టన్ను ఏసీపై ఎంత బిల్లు వస్తుందో? చూద్దాం.
వాస్తవానికి ఏసీ విద్యుత్ బిల్లు ఎంత అనేది ఏసీ విద్యుత్ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. 1 స్టార్ నుంచి 5 స్టార్ వరకు రేటింగ్ ఉన్న ఏసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 1 స్టార్ ఏసీ ధర చౌకైనది కానీ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. అయితే 5 స్టార్ ఏసీ అత్యంత విద్యుత్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే 3 స్టార్ ఏసీలు 5 స్టార్ ఏసీ ధరలతో పోల్చి చూస్తే చౌకగా ఉంటాయి. మీరు 5 స్టార్ రేటింగ్‌తో 1.5 టన్ను స్ప్లిట్ ఏసీను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే అది గంటకు దాదాపు 840 వాట్స్ (0.8కేడబ్ల్యూహెచ్) విద్యుత్‌ను వినియోగిస్తుంది. మీరు రోజుకు సగటున 8 గంటలు ఏసీని ఉపయోగిస్తే మీ ఏసీ ఒక రోజులో 6.4 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. మీ ఇంట్లో విద్యుత్ రేటు యూనిట్‌కు రూ. 7.50 అనుకుంటే బిల్లు రోజుకు రూ. 48 మరియు నెలలో దాదాపు రూ. 1500 అవుతుంది.
మరోవైపు 3 స్టార్ రేటింగ్ కలిగిన 1.5 టన్నుల ఏసీ గంటలో 1104 వాట్స్ (1.10 కేడబ్ల్యూహెచ్) విద్యుత్‌ను వినియోగిస్తుంది. దీన్ని 8 గంటలు వాడితే ఒక రోజులో 9 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. దీని ప్రకారం బిల్లు ఒక రోజులో రూ.67.5 మరియు నెలలో రూ.2,000 అవుతుంది. దీన్ని బట్టి చూస్తే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ పై నెలకు రూ. 500 ఆదా చేసుకోవచ్చు. కాబట్టి మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఏసీను ఎంచుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..