AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Rent: అక్కడ ఇంటి అద్దెలను చూస్తే జడుసుకోవాల్సిందే.. 2బీహెచ్‌కే ఇంటి అద్దె నెలకు ఏకంగా రూ. 90వేలు..

ఒక కొత్త ఫ్లాట్ తీసుకుంటే చెల్లించే ఈఎమ్ఐకి దాదాపు సమానంగా ఇంటి అద్దె ఉంటుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బంది లేనివారు కొత్త ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాత్రం అద్దెల దరువుతో అవస్థలు పడుతున్నారు. ఆన్ లైన్ నివేదికల ప్రకారం.. దేశంలో సగటు జీతాల పెంపు 2022లో 10.6 శాతంగా ఉంది. అది 2023లో 9.7 శాతానికి తగ్గింది.

House Rent: అక్కడ ఇంటి అద్దెలను చూస్తే జడుసుకోవాల్సిందే.. 2బీహెచ్‌కే ఇంటి అద్దె నెలకు ఏకంగా రూ. 90వేలు..
House Rent
Madhu
|

Updated on: May 20, 2024 | 9:23 AM

Share

ఉద్యోగం, వ్యాపారం, చదువు రీత్యా సొంతూరి నుంచి పట్టణాలకు వలస వెళ్లడం ఇప్పుడు సాధారణ విషయం. అలా వెళ్లిన వారందరూ అద్దె ఇళ్ల ను ఆశ్రయిస్తారు. నెలకు కొంత మొత్తం అద్దెగా చెల్లిస్తూ ఉంటారు. అయితే అద్దెలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఉద్యోగులకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం అద్దెగా చెల్లించాల్సి వస్తోంది. ఇది వారి ఆర్థిక ప్రణాళికను అస్తవ్యస్తం చేస్తోంది. ముఖ్యంగా పొదుపు పై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. వచ్చే ఆదాయానికి, చెల్లించే ఇంటి అద్దెలకు మధ్య వ్యత్సాసం బాగా పెరిగిపోవడంతో ఉద్యోగస్తులు అవస్థలు పడుతున్నారు.

పెరుగుతున్న అద్దెలు..

ఒక కొత్త ఫ్లాట్ తీసుకుంటే చెల్లించే ఈఎమ్ఐకి దాదాపు సమానంగా ఇంటి అద్దె ఉంటుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బంది లేనివారు కొత్త ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాత్రం అద్దెల దరువుతో అవస్థలు పడుతున్నారు. ఆన్ లైన్ నివేదికల ప్రకారం.. దేశంలో సగటు జీతాల పెంపు 2022లో 10.6 శాతంగా ఉంది. అది 2023లో 9.7 శాతానికి తగ్గింది. అంటే ఉద్యోగుల జీతాల పెంపు శాతం తగ్గిపోయింది. దానికి విరుద్ధంగా మెట్రో నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగాయి. అంటే 2022 లో ఉన్న అద్దెలు ప్రస్తుతం దాదాపు 30 శాతం పెరిగాయి.

బెంగళూర్ లో డిమాండ్..

బెంగళూరులో రెంట్ ఇన్ఫెక్షన్ అనేది (డిమాండ్) అనేది 24 శాతం ఉంది. టెక్ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్స్‌ల ఉన్న ప్రాంతాల్లో 35 శాతంగా అంచనా. కరోనా మహమ్మారి తర్వాత కంపెనీలు ఆఫీసుల నుంచే కార్యకలాపాలను ప్రారంభించడంతో ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. అలాగే నగరంలోకి పెరుగుతున్న వలసలు మరో కారణంగా చెప్పవచ్చు.

విపరీతంగా పెరుగుదల..

బెంగళూర్ లోని ఒక మార్కెటింగ్ ప్రోఫెషనల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన ఇంటి అద్దెను యజమాని ఇటీవల 30 శాతం పెంచాడు. దీంతో వేరే ఇల్లు వెతికినప్పటికీ ఆయన బడ్జెట్ లో దొరకలేదు. దీంతో పెరిగిన అద్దెకు ఒప్పుకోక తప్పలేదు. ప్రస్తుతం బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో అద్దెలు దాదాపుగా ముంబైలోని వర్లీ, బాంద్రా, జుహు, వెర్సోవా వంటి ప్రధాన ప్రదేశాలతో సమానంగా ఉన్నాయి. సగటు అద్దె రూ. 90 వేల నుంచి రూ.2 లక్షల వరకూ ఉంది.

ముంబైలోనూ అదెే పరిస్థితి..

ముంబై కి చెందిన ఒక వ్యక్తి 2బీహెచ్ కే (రెండు బెడ్ రూమ్ లు, హాలు, కిచెన్) లో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల యజమాని అద్దెను రూ. 18 వేల నుంచి రూ.90 వేలకు పెంచాడు. అద్దెలు ఎంతగా పెరుగుతున్నాయో తెలియడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ముంబైలో నెలకు రూ.30 వేల కంటే తక్కువ ధరకు సరైన 1 బీహెచ్ కే కూడా దొరకడం లేదు. ఢిల్లీ తదితర ఇతర మెట్రో నగరాలలోనూ ఇదే పరిస్థితి.

మెట్రో పాలిటన్ నగరాలలో..

దేశంలోని మెట్రో పాలిటన్ నగరాలలో అద్దెలు 17.4 శాతం పెరిగాయి. గురుగ్రామ్ 31.3 శాతంతో ముందుంది. బెంగళూరులో 23.1, ఢిల్లీలో 10.5 శాతం పెరుగుదల నమోదైంది. ఏదైనా అద్దెలు, ఖర్చులు పెరుగుతున్నంత వేగంగా ఆదాయం పెరగడం లేదు. దీంతో అద్దె ఇళ్లలో జీవించేవారు అనేక అవస్థలు పడుతున్నారు. 2024 మార్చి – ఏప్రిల్ లో నిర్వహించిన హౌసింగ్ సెంటిమెంట్ ఇండెక్స్‌లో మొదటి ఏడు నగరాల్లో అత్యల్పంగా బెంగళూరు 141వ స్థానంలో నిలిచింది. 4500 మంది గృహ కొనుగోలుదారులను సర్వే చేసిన అధ్యయనం చేయగా కోల్‌కతాకు 160, గురుగ్రామ్ 157, నోయిడా 154 స్థానాలలో నిలిచాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..