AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Rail App: జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కాగా కన్ఫార్మ్.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

ప్రయాణికులు సులభంగా, కచ్చితంగా రైలు టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటు జియో రైల్ యాప్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. జియో రైల్‌ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా జియో యూజర్లు అయ్యి ఉండాలి. ఇతర నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్న వారు ఈ సేవలను పొందలేరు. రైలు టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

Jio Rail App: జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కాగా కన్ఫార్మ్.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..
Jio Rail App
Narender Vaitla
|

Updated on: May 20, 2024 | 11:02 AM

Share

ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్‌ జియో యూజర్లకు ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఫైనాన్స్‌ మొదలు ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్ని రకాల సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే జియో రైల్ యాప్‌ పేరుతో రైల్వే టికెట్ రిజర్వేషన్‌ సర్వీస్‌ను కూడా అందిస్తోన్న విషయం తెలిసిందే. జియో రైల్‌ యాప్‌ పేరుతో 2019 నుంచి సేవలను ప్రారంభించారు. ఇంతకీ జియో రైల్‌ యాప్‌ ప్రత్యేకతలు ఏంటి.? ఇందులో టికెట్స్‌ను ఎలా బుక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణికులు సులభంగా, కచ్చితంగా రైలు టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటు జియో రైల్ యాప్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. జియో రైల్‌ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా జియో యూజర్లు అయ్యి ఉండాలి. ఇతర నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్న వారు ఈ సేవలను పొందలేరు. రైలు టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో జియో ఈ సేవలు అందిస్తోంది. ఈ యాప్‌ సహాయంతో యూజర్లు యూపీఐ పేమెంట్స్, జియో మనీతో పాటు అన్ని రకాల బ్యాంకులకు చెందిన క్రెడిట్‌, డెబిట్ కార్డులతో బుక్‌ చేసుకోవచ్చు. జియో రైల్ యాప్‌ ఇంగ్లిష్‌తో పాటు హిందీలోనూ అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో మీరు అంతకు ముందు ప్రయాణించి ట్రావెల్ హిస్టరీతో పాటు, రైల్వే స్టేషన్స్‌, రైలు ఛార్జీల వివరాలను తెలుసుకోవచ్చు.

టికెట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలి..

* ఇందుకోసం ముందుగా జియో రైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* అనంతరం మీ జియో ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి ఓటీపీతో కన్ఫార్మ్ చేసుకోవాలి.

* తర్వాత కొన్ని వివరాలు అందజేయడం ద్వారా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ పూర్తవుతుంది. అంనతరం మీరు ఎక్కడ రైలు ఎక్కాలనుకుంటున్నారు.? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు.? అనే వివరాలు అందించాలి.

* అనంతరం మీరు ప్రయాణం చేయాలనుకుంటున్న తేదీని సెలక్ట్ చేసుకోవాలి. ఇక సీట్లను బుక్‌ చేసుకొని, చివరిగా పేమెంట్‌ చేస్తే సరిపోతుంది. మీ టికెట్స్‌ కన్ఫార్మ్ అవుతాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?