Honda Recall: 3 లక్షల హోండా కార్లు రీకాల్. కారణం ఏమిటో తెలుసా?
Honda Recall: ఇంధన ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోపభూయిష్ట ప్రోగ్రామింగ్ ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, కారు ఇంజిన్‌లో లోపం వల్ల థ్రోటిల్‌లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని, దీని వలన ఇంజిన్ డ్రైవ్ పవర్ తగ్గవచ్చని..

హోండా తన దాదాపు 3 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ జనవరి 29, 2025న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కారు ఇంజిన్‌లో సమస్యల ఫిర్యాదుల నేపథ్యంలో అమెరికాలో దాదాపు 2.95 లక్షల కార్లను రీకాల్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. మరి కారులో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఇంధన ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోపభూయిష్ట ప్రోగ్రామింగ్ ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, కారు ఇంజిన్‌లో లోపం వల్ల థ్రోటిల్‌లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని, దీని వలన ఇంజిన్ డ్రైవ్ పవర్ తగ్గవచ్చని, ఇంజిన్ అడపాదడపా నిలిచిపోవచ్చని లేదా అకస్మాత్తుగా ఆగిపోతుందని హోండా తెలిపింది. కారు నడుపుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Jio AirFiber: జియో అదిరిపోయే గుడ్‌న్యూస్.. రూ.599కే ఇంటర్నెట్, 12 ఓటీటీలు, 800కుపైగా టీవీ ఛానళ్లు!
ఇవి రీకాల్
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2022-2025 అకురా MDX టైప్-S, 2023-2025 హోండా పైలట్, 2021-2025 అకురా TLX టైప్-S వాహనాలను రీకాల్ చేశారు.
వాహనదారులకు సమాచారం:
ఇంజిన్ సమస్యలు ఉన్న వాహన మోడళ్ల యజమానులను మార్చిలో ఇమెయిల్ ద్వారా సంప్రదిస్తామని హోండా తెలిపింది. ఈ మెయిల్ ఆ కార్ల యజమానులకు వారి వాహనాలను అధీకృత హోండా లేదా అకురా డీలర్ వద్దకు తీసుకెళ్లమని, అక్కడ FI-ECU సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని తెలియజేస్తుంది. దీనికి కార్ల యజమానులు ఎటువంటి ధర చెల్లించాల్సిన అవసరం లేదు. తలెత్తిన లోపాలను సరి ఉచితంగానే సరి చేసి ఇస్తారు.
ఇది కూడా చదవండి: Gold Price: పట్టపగ్గాలు లేకుండా పసిడి పరుగులు.. రూ.8 వేలు పెరిగిన బంగారం.. లక్ష మార్క్ దాటుతుందా?
హోండా కారు యజమానుల కోసం కస్టమర్ సర్వీస్ నంబర్‌ను కూడా విడుదల చేసింది. కారు యజమానులు ఈ నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చు. కస్టమర్ సర్వీస్ నంబర్ 1-888-234-2138. ఈ రీకాల్ కోసం హోండా EL1, AL0 సంఖ్యలను ఇచ్చింది. అదనంగా కారు యజమానులు NHTSA వాహన భద్రతా హాట్‌లైన్‌ను 1-888-327-4236కు కాల్ చేయడం ద్వారా లేదా nhtsa.gov వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది అప్పుడే.. తేదీ ఖరారు!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి