AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan EMI: వడ్డీ రేటు పెరగడం వల్ల గృహ రుణం వాయిదా పెరిగిందా..? ఈఎంఐ భారాన్ని ఇలా తగ్గించుకోండి

చాలా మంది హోమ్‌లోన్స్‌ తీసుకుంటారు. ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఎక్కువ నెలలు పెట్టుకుంటే ఈఎంఐ భారం పెరుగుతూ ఉంటుంది. అందుకంటే వడ్డీరెట్ల పెరగడం, త్వరగా ఈఎంఐ

Home Loan EMI: వడ్డీ రేటు పెరగడం వల్ల గృహ రుణం వాయిదా పెరిగిందా..? ఈఎంఐ భారాన్ని ఇలా తగ్గించుకోండి
Loan Emi
Subhash Goud
|

Updated on: Jan 05, 2023 | 8:30 AM

Share

చాలా మంది హోమ్‌లోన్స్‌ తీసుకుంటారు. ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఎక్కువ నెలలు పెట్టుకుంటే ఈఎంఐ భారం పెరుగుతూ ఉంటుంది. అందుకంటే వడ్డీరెట్ల పెరగడం, త్వరగా ఈఎంఐ పూర్తి కాకపోవడం వంటివి ఉంటాయి. మీరు హోమ్‌లోన్‌ పై వడ్డీరేట్లు పెరిగితే ఎక్కువ భారం మోయాల్సి ఉంటుంది. ఒక వేళ మీ ఈఎంఐ వాయిదాలు పెరిగినట్లయితే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే మీ హోమ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ కారణంగా మీరు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే కొన్ని విషయాలను పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు పెంపుదల అతిపెద్ద ప్రభావం గృహ రుణంపై ఉంది. రెపో రేటును పెంచిన తర్వాత, చాలా బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేట్లను 2 శాతం వరకు పెంచాయి. దీని తర్వాత, గృహ కొనుగోలుదారులపై ఈఎంఐ భారం పెరిగింది.

ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం వల్ల వచ్చే ప్రతికూలత పెద్ద మొత్తంలో, దీర్ఘకాలిక రుణాలు తీసుకునే వారిపై ఎక్కువగా ఉంటుంది. మీరు రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి 20 సంవత్సరాల వాయిదా మిగిలి ఉంది, అలాగే వడ్డీ రేటు 7 నుండి 9.25 శాతానికి పెరిగింది. అలాంటి సమయంలో ఈఎంఐ రూ. 38,765 నుండి రూ. 45,793కి పెరుగుతుంది. రుణం మొత్తం ఈ మేరకు ఈ భారం పెరుగుతుంది. మీ లోన్ మొత్తం దాదాపు రూ. 16.86 లక్షలు పెరుగుతోంది. రూ.43.03 లక్షల నుంచి రూ.59.90 లక్షలకు పెరగనుంది.

మీరు మీ హోమ్ లోన్ యొక్క EMI భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే, మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. మీరు వాటిని ఒక చూపులో అర్థం చేసుకోవచ్చు. గృహ రుణగ్రహీతలు తమ నెలవారీ వ్యయంలో ఎక్కువ భాగాన్ని ఈఎంఐ కోసం వెచ్చిస్తారు. అందువల్ల ఎంత తక్కువ వాయిదా వేస్తే అంత మంచిదని గుర్తించుకోవాలి. ఆర్బీఐ నుండి లేదా బ్యాంకు వైపు నుండి వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా హోమ్ లోన్ ఈఎంఐ నియంత్రణలో ఉంచుకోవడానికి పాక్షిక ముందస్తు చెల్లింపు లేదా లోన్ ప్రీపేమెంట్ ఒక గొప్ప ఆప్షన్‌. దీంతో పెరుగుతున్న వడ్డీ భారం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

హోమ్ లోన్‌లో పాక్షిక ముందస్తు చెల్లింపు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. రుణం మొత్తం రూ.50 లక్షలు అయితే దీని వడ్డీ రేటు 9.40 శాతం. మీకు 15 సంవత్సరాల ఇన్‌స్టాల్‌మెంట్ మిగిలి ఉంది. అందుకే మీరు రూ. 7.5 లక్షల పాక్షిక ముందస్తు చెల్లింపు చేస్తే, మీరు వడ్డీగా రూ. 17.73 లక్షలు ఆదా చేయవచ్చు. అలాగే, దాదాపు 48 నెలల లోపు రుణం పూర్తిగా చెల్లించబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి