Telugu News Business Here is the step by step guide to activate or deactivate your PAN card, check details in telugu
PAN Card: పాన్ కార్డు పనిచేయడం లేదా? ఇలా సింపుల్‌గా యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు..
పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా మారిపోతే.. మీ ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోతాయి. అలాంటప్పుడు మీరేం చేయాలి. దానిని తిరిగి యాక్టివేట్ చేసుకోవడం ఎలా? లేదంటే మీ పేరుతోనే రెండు పాన్ కార్డులు ఉన్నాయనుకోండి.. ఒక దానిని డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారు. ఎలా చేయాలి? కంగారు పడకండి.. ఆన్ లైన్లో దీనిని నిర్వహించవచ్చు. పాన్ కార్డు యాక్టివేట్, డీయాక్టివేట్ చేసుకొనే వెసులుబాటు ఉంది.
పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కార్డ్ కి మన దేశంలో చాలా ప్రాధాన్యం ఉంది. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి చేసే ఆర్థిక లావాదేవీలన్నీ దీని ఆధారంగానే నడుస్తాయి. అలాంటి పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా మారిపోతే.. మీ ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోతాయి. అలాంటప్పుడు మీరేం చేయాలి. దానిని తిరిగి యాక్టివేట్ చేసుకోవడం ఎలా? లేదంటే మీ పేరుతోనే రెండు పాన్ కార్డులు ఉన్నాయనుకోండి.. ఒక దానిని డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారు. ఎలా చేయాలి? కంగారు పడకండి.. ఆన్ లైన్లో దీనిని నిర్వహించవచ్చు. పాన్ కార్డు యాక్టివేట్, డీయాక్టివేట్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఆ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పాన్ కార్డ్ యాక్టివేట్ చేయడం ఇలా..
మీరు మీ పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడంలో విఫలమైతే.. మీ పాన్ కార్డ్ పని చేయడం నిలిచిపోతుంది. దీంతో ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించలేరు. అలాంటప్పుడు మీరు దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి ఒక మార్గం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్ ప్రకారం, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి అవకాశం ఉంది. ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రూ. 1,000 చెల్లించి ప్రక్రియను పూర్తి చేయొచ్చు. అప్పుడు మీ పాన్ కార్డు 30 రోజుల్లో మళ్లీ ఆపరేటివ్ అవుతుంది. దీనికి మరో రూ. 1,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇలా ఉంటుంది.
రీయాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి, పాన్ కార్డ్‌ని మళ్లీ పని చేయడానికి లింక్ చేసిన తేదీ నుండి దాదాపు 30 రోజులు పడుతుంది.
మీ పాన్ కార్డును డీయాక్టివేట్ చేయడం ఎలా?
పాన్ అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్. ఇది గుర్తింపునకు కీలకమైన రుజువుగా పనిచేస్తుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీఆర్) దాఖలు చేయడంతో సహా వివిధ ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లను కలిగి ఉండటం చట్టవిరుద్ధం మరియు ఒక వ్యక్తి, కంపెనీ లేదా వ్యాపార సంస్థ పేరుతో బహుళ పాన్ కార్డ్‌లు జారీ చేయబడిన సందర్భాల్లో, అదనపు పాన్ కార్డ్‌లను సరెండర్ చేయడం లేదా రద్దు చేయడం అవసరం. బహుళ పాన్ కార్డ్‌లను కలిగి ఉండటం చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఆదాయపు పన్ను మదింపుల సమయంలో సమస్యలకు దారితీయవచ్చు.