Aditya Birla Sun Life: నెలవారీ ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం.. ఉద్యోగులూ వదలొద్దు..
ఇటీవల మరో పథకానికి ఏబీఎస్ఎల్ఐ శ్రీకారం చుట్టింది. అది కేవలం ఉద్యోగులకు మాత్రమే ఉద్దేశించిన పథకం. ఈ పాలసీ పేరు ఏబీఎస్ఎల్ఐ శాలరీడ్ టెర్మ్ ప్లాన్. ఇది బడ్జెట్ పరిధిలోనే ఉండే స్నేహపూర్వక ప్లాన్. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇండివిజువల్, ప్యూర్ రిస్క్, ప్రీమియం ప్లాన్. జీతం పొందే నిపుణులకు వారి వ్యక్తిగత రక్షణ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను రూపొందించుకునే స్వేచ్ఛను అందిస్తుంది.

ఇటీవల కాలంలో జీవిత బీమా పథకాలను ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత కాలంలో దీనికి ప్రాధాన్యం పెరిగింది. అకస్మాత్తుగా అనుకోని సంఘటనల నడుమ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ బీమా పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు అనేక ప్రైవేటు సంస్థలు కూడా విభిన్న రకాల ప్రయోజనాలు, ప్రీమియంలతో పాలసీలు అందిస్తున్నాయి. అటువంటి సంస్థల్లో ప్రముఖ ప్రైవేటు సంస్థ, ప్రజల ఆదరణ పొందిన సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్(ఏబీఎస్ఎల్ఐ). దీనిలో అనేక రకాల స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల మరో పథకానికి ఏబీఎస్ఎల్ఐ శ్రీకారం చుట్టింది. అది కేవలం ఉద్యోగులకు మాత్రమే ఉద్దేశించిన పథకం. ఈ పాలసీ పేరు ఏబీఎస్ఎల్ఐ శాలరీడ్ టెర్మ్ ప్లాన్. ఇది బడ్జెట్ పరిధిలోనే ఉండే స్నేహపూర్వక ప్లాన్. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇండివిజువల్, ప్యూర్ రిస్క్, ప్రీమియం ప్లాన్. జీతం పొందే నిపుణులకు వారి వ్యక్తిగత రక్షణ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను రూపొందించుకునే స్వేచ్ఛను అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏబీఎస్ఎల్ఐ శాలరీడ్ టర్మ్ ప్లాన్..
- ఏబీఎస్ఎల్ఐ శాలరీడ్ టర్మ్ ప్లాన్ పాలసీదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన లైఫ్ కవర్ ఆప్షన్లను అందిస్తుంది.
- సంప్రదాయక లైఫ్ కవర్ మాత్రమేకాక, పాలసీదారుడు లైఫ్ కవర్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (ఆర్ఓపీ) ఆప్షన్ ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఖాతాదారుడు చెల్లించిన మొత్తం ప్రీమియంలను తీసుకోడానికి వీలు కల్పిస్తుంది.
- ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ కవర్ ఆప్షన్ కూడా దీనిలో అందుబాటులో ఉంటుంది. ఇందులో నామినీ నెలవారీ ఆదాయాన్ని అందుకునే వీలుంటుంది. నెలవారీ ఆదాయం ఎంత వస్తుందంటే మీరు పాలసీ మొత్తంలో 1.25శాతం తీసుకోవచ్చు. ఇది మీరు ఎంపిక చేసుకున్న వ్యవధి 10, 15 లేదా 20 సంవత్సరాల వరకూ అందిస్తారు.
- ఏబీఎస్ఎల్ఐ శాలరీడ్ టర్మ్ ప్లాన్‌లోని ఇన్‌క్రేసింగ్ ఇన్‌కమ్ కవర్ ఆప్షన్‌లు కూడా ఇలాంటి ప్రయోజనాలను అందిస్తాయి. అయితే సాధారణ వడ్డీ ప్రాతిపదికన సంవత్సరానికి 5% లేదా 10% ఆదాయ వృద్ధి రేటు ఎంపిక ఆధారంగా వార్షికంగా ఆదాయం పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉండే ఆదాయ గ్రహీతగా ఉండటానికి నామినీని అనుమతిస్తుంది.
- ఈ ఏబీఎస్ఎల్ఐ శాలరీడ్ టర్మ్ ప్లాన్ 49 సంవత్సరాల పాలసీ వ్యవధితో దీర్ఘకాలిక సమగ్ర రక్షణను అందిస్తుంది. దీనిని 21 నుంచి 55 సంవత్సరాల వయస్సున్న వారు ఎవరైనా ప్రారంభించొచ్చు. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు. ఉంటుంది. పాలసీ కాల వ్యవధి 5, 7, 10, 12, 15, 20 ఏళ్ల మధ్య ఏదైనా ఎంచుకోవచ్చు.
ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండీ అండ్ సీఈఓ కమలేష్ రావు మాట్లాడుతూ, ఏబీఎస్ఎల్ఐ శాలరీడ్ టర్మ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా, జీతం పొందే వ్యక్తులు వారి రక్షణ అవసరాలను తీర్చుతామని చెప్పారు. ఈ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ తమ కస్టమర్‌లకు అనుకూలీకరించిన రక్షణ పరిష్కారాన్ని అందించడంలో తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాక భారతదేశంలోని జీతం పొందే నిపుణుల ఆకాంక్షలు, ఆర్థిక భవిష్యత్తును కాపాడడంలో నమ్మకమైన భాగస్వామిగా తమ సంస్థ అవతరిస్తుందని పేర్కొన్నారు.
అదనపు రక్షణ కోసం, పాలసీదారులకు అనేక రైడర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ప్లస్/ ఏబీఎస్ఎల్ఐ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్, హాస్పిటల్ కేర్ రైడర్ అండ్ ప్రీమియం రైడర్ మాఫీ వంటివి ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..