AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foldable Motorcycle: బయటకొస్తే బైక్.. ఇంట్లో ఉంటే ఇన్వెర్టర్.. బుల్లి బైక్ మడతపెట్టి కారు డిక్కీలో పెట్టేయొచ్చు..

మన ఊహలకు స్వరూపం ఇస్తే ఎలా ఉంటుందో ఈ బైక్ అలా ఉంటుంది. చాలా చిన్న సైజ్ లో ఉండే ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ బైక్ ఇది. దీని బరువు 37 కేజీలు మాత్రమే. దీనిలోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. ఇదే బ్యాటరీని ఇంట్లో ఇన్వెర్టర్ గా కూడా వాడుకోవచ్చు.

Foldable Motorcycle: బయటకొస్తే బైక్.. ఇంట్లో ఉంటే ఇన్వెర్టర్.. బుల్లి బైక్ మడతపెట్టి కారు డిక్కీలో పెట్టేయొచ్చు..
M One foldable Bike
Follow us
Madhu

|

Updated on: Mar 27, 2023 | 12:30 PM

ఫోల్డబుల్ బైక్స్ గురించి ఎప్పుడైన విన్నారా? ఎప్పుడో 1981లో హోండా నుంచి ఓ ఫోల్డబుల్ బైక్ కారు డిక్కీలో పట్టేంత చిన్నదిగా తీసుకొచ్చారు. దాని పేరు మోటోకాంపో. అయితే కొన్ని అనివార్య కారణాలు, ప్రతికూలతల కారణంగా ఆ బైక్ ఉత్పత్తిని 1983లోనే నిలిపివేశారు. అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో చైనీస్ మోటార్ సైకిల్ తయారీదారైన ఫెలో ఓ కొత్త ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆవిష్కరించింది. ఫెలో టూ ఎం వన్(FELOTOO M One) ఎలక్ట్రిక్ స్కూటర్ పేరిట దీనిని టోక్యో మోటార్ షో లో ప్రదర్శించింది.

ఎం వన్ స్కూటర్ ఇలా ఉంటుంది..

మన ఊహలకు స్వరూపం ఇస్తే ఎలా ఉంటుందో ఈ బైక్ అలా ఉంటుంది. చాలా చిన్న సైజ్ లో ఉండే ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ బైక్ ఇది. దీని బరువు 37 కేజీలు మాత్రమే. దీనిలో 1000 వాట్స్ పీక్ రేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 48V, 20Ah బ్యాటరీ ఒక kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. అయితే వేగంగా ప్రయాణించడానికి మాత్రం అనుకూలంగా ఉండదు. సిటీ పరిధిలో కేవలం 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో మాత్రమే ప్రయాణించగలుతుంది.

ఇన్వెర్టర్ గా ఉపయోగించుకోవచ్చు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని మరో ఆసక్తికర ఫీచర్ ఏంటంటే వీ2ఎల్( వెహికల్ టూ లోడ్). దీని ద్వారా మీ ఇంట్లోని వస్తువులు ఈ బైక్ లోని బ్యాటరీ ద్వారా ఆన్ చేసుకొని వివనియోగించుకోవచ్చు. అంటే అచ్చం ఇన్వెర్టర్ లా కూడా వినియోగించుకోవచ్చు. దీని బ్యాటరీలు అందుకు సహకరిస్తాయి.

ఇవి కూడా చదవండి

ధర ఎంతంటే..

ఈ ఎం వన్ స్కూటర్ ప్రస్తుతం చైనా తో పాటు జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. నాలుగో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర 2,900 అమెరికన్ డాలర్లు ఉంటుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 2,38,710 ఉండే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..