Personal Loan: పర్సనల్ లోన్లపై లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవి.. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ అంటే..
పర్సనల్ లోన్లు అసురక్షితమైనవి. కేవలం వ్యక్తుల క్రెడిట్ ఆధారంగానే వీటిని బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అయితే కార్ లోన్, గోల్డ్ లోన్లు సురక్షితమైన వాటిల్లోకి వస్తాయి. పర్సనల్ లోన్లలో వడ్డీ రేటు ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటాయి. లోన్ మంజూరు ప్రాసెసింగ్ ఫీజులు కూడా వసూలు చేస్తారు. పలు బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..

అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్లు ఉపయుక్తంగా ఉంటాయి. ఎటువంటి పత్రాలు లేకుండా, హామీ లేకుండా క్షణాల్లో డబ్బులు కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. కేవలం వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు ఈ లోన్లు మంజూరు చేస్తుంటాయి. వ్యక్తులకు అప్పటికే ఉన్న అప్పులు, వాటిని తిరిగి చెల్లించే చరిత్రను సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు అంచనా వేస్తుంటాయి. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే సులభంగా అధిక మొత్తం లోన్లు తక్కువ వడ్డీకే మంజూరు అవుతుంటాయి. అయితే వీటిల్లో వడ్డీ ఇతర రుణ మార్గాలతో పోల్చితే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ కావాలంటే గోల్డ్ లోన్లు, కారు లోన్లు. ఎందుకంటే ఇవి సురక్షిత లోన్లు. బ్యాంకర్లు చెల్లించే మొత్తానికి గోల్డ్ లోన్లో అయితే మీ బంగారం భరోసా ఇస్తుంది. అదే కారు లోన్లో అయితే కారు అనేది ఒక అసెట్ గా బ్యాంకర్లు చూస్తారు. ఇదే సమయంలో పర్సనల్ లోన్లకు ఇలాంటి ఏమి ఉండవు. అందుకే ఇవి అసురక్షితమైనవి. కేవలం వ్యక్తుల క్రెడిట్ ఆధారంగానే వీటిని బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అయితే ఈ లోన్లలో వడ్డీ రేటు ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటాయి. లోన్ మంజూరు ప్రాసెసింగ్ ఫీజులు కూడా వసూలు చేస్తారు. పలు బ్యాంకుల్లో పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంకులో మీరు రూ. లక్ష పర్సనల్ లోన్ తీసుకుంటే ఐదేళ్ల కాలపరిమితితో ఈఎంఐ ఆప్షన్లు ఎంచుకుంటే వడ్డీ రేటు 9.30 నుంచి 13.40శాతం వరకూ ఉంటుంది. దీనిలో ప్రాసెసింగ్ ఫీజు లోను మొత్తంలో 0.50శాతం లేదా కనీసం రూ. 500తో పాటు జీఎస్టీ వసూలు చేస్తారు. మహిళా దరఖాస్తు దారులకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. ఈ బ్యాంకులో రూ.లక్ష లోన్ తీసుకుంటే ఐదేళ్ల టెన్యూర్ పెట్టుకున్నారనుకుటే వడ్డీ రేటు 10శాతం నుంచి 12.80 వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఒకశాతంతో జీఎస్టీ వసూలు చేస్తారు.
ఇండియన్ బ్యాంక్.. దీనిలో పర్సనల్ లోన్ రూ. లక్ష తీసుకుంటే ఐదేళ్ల కాలపరిమితి పెట్టుకుంటే వడ్డీ రేటు 10శాతం నుంచి 11.40శాతం వరకూ ఉంటుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు ఒక శాతం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు ఉండవు.
బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఇక్కడ రూ.లక్ష పర్సనల్ తీసుకుంటే ఐదేళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు 10.10శాతం నుంచి 18.25శాతం ఉంటుంది. 1శాతం నుంచి 2శాతం ప్లస్ జీఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్.. దీనిలో రూ. లక్ష పర్సనల్ లోన్ తీసుకుంటే ఐదేళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు 10.15 నుంచి 12.80 వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50శాతం నుంచి 1శాతం ప్లస్ జీఎస్టీ ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంకులో రూ. లక్ష పర్సనల్ తీసుకుంటే ఐదేళ్ల టెన్యూర్ పెట్టుకుంటే వడ్డీ రేటు 10.25శాతం నుంచి 14.75 వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 2శాతం వసూలు చేస్తారు.
యాక్సిస్ బ్యాంక్.. దీనిలో రూ.లక్ష పర్సనల్ లోన్ తీసుకుంటే గరిష్టంగా ఐదేళ్ల కాలపరిమితి లోపు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 10.49శాతం నుంచి 22.00 వరకూ ఉంటుంది. ఈ బ్యాంకులో ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఈ బ్యాంకులో రూ.లక్ష పర్సనల్ లోన్ తీసుకుంటే గరిష్టంగా ఐదేళ్ల కాలపరిమితి లోపు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 10.50శాతం నుంచి 24.00శాతం వరకూ ఉంటుంది. దీనిలో ప్రాసెసింగ్ ఫీజు2.5శాతం వరకూ ప్లస్ జీఎస్టీ ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్.. దీనిలో రూ. లక్ష పర్సనల్ లోన్ తీసుకుంటే ఐదేళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు 10.50శాతం నుంచి 16.00 వరకూ ఉంటుంది. గరిష్టంగా 2.5శాతం వరకూ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




