Retirement Planning: రిటైర్ అయ్యాక కూడా ప్రతి నెలా రూ. 50,000 సంపాదించొచ్చు.. అదెలా? ఇది చదవండి..
ఈ పథకాన్ని 2004లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ప్రైవేట్ రంగ ఉద్యోగులను కూడా కలిపారు. మీరు ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టే పెట్టుబడి ఆధారంగానే పదవీవిరమణ తర్వాతే మీకు నెలవారీ ఆదాయం లభిస్తుంది. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే.. కార్పస్ అంత ఎక్కువగా ఉంటుంది.

జీవితంలో పదవీవిరమణ ప్రణాళిక చాలా ప్రాధాన్యమైనది. ముందుగానే పదవివీరమణ కోసం ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో శక్తి సామర్థ్యాలుండవు. అవకాశాలు కూడా దొరకవు. అంతేకాక ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగిపోతుంది. సుఖమయ జీవనం గడపటం కష్టతరమవుతుంది. ఈ క్రమంలో అందరూ పదవీవిరమణ తర్వాత జీవితం కోసం ముందు నుంచే ఆలోచిస్తున్నారు. ఎటువంటి పథకాలైతే బావుంటాయి.. ఆ సమయంలో ఆర్థిక భద్రతను ఏ పథకాలు అందిస్తాయి అనేది వెతికి తెలుసుకుంటున్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనల్లో ఉంటే ఈ కథనం మీకోసమే. పదవీ విరమణసమయంలో ఆర్థిక భరోసా అందించేందుకు నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్) బాగా ఉపకరిస్తుంది. నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకంలో నెలకు రూ. 50,000 కూడా పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
నేషనల్ పెన్షన్ స్కీమ్..
ఈ పథకాన్ని 2004లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ప్రైవేట్ రంగ ఉద్యోగులను కూడా కలిపారు. మీరు ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టే పెట్టుబడి ఆధారంగానే పదవీవిరమణ తర్వాతే మీకు నెలవారీ ఆదాయం లభిస్తుంది. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే.. కార్పస్ అంత ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు పెట్టుబడి పెట్టడం కూడా త్వరగా ప్రారంభించాలి. అప్పుడే మీకు అధిక ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకంలో కాంపౌండింగ్ రాబడి వస్తుంది కాబట్టి సుదీర్ఘ కాలం పెట్టుబడి ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది.
ప్రతి నెల రూ. 50,000 పొందడం ఎలా?
మీరు 25 సంవత్సరాల వయస్సులో ఎన్‌పీఎస్‌లో నెలకు రూ. 6,550 పెట్టుబడి పెట్టడం ప్రారంభింస్తే.. తదుపరి 35 సంవత్సరాలు అంటే మీ వయసు అప్పుడు 60 ఏళ్లు అవుతుంది. ఆ సమయంలో రిటైర్ అయిపోయాక, ఈ పథకం మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు నెలనెలా రూ. 50,000 పెన్షన్‌ను పొందుతారు. ఇది ఎలా ఉంటే లెక్క ఇదిగో..
వయస్సు: 25 సంవత్సరాలు
పదవీ విరమణ వయస్సు: 60
మీ కంట్రిబ్యూషన్: రూ. 6,650/నెలకు
ఆశించిన రాబడి: 10%
మీకు వచ్చే మొత్తం: రూ. 2,50,75,245
మీరు ఆ కార్పస్ నుంచి 60 శాతం మొత్తాన్ని రిటైర్మెంట్ వయస్సులో మీరు ఉపసంహరించుకునే ఆ సందర్భంలో మీకు 40 శాతం వార్షికాదాయం మిగిలి ఉంటుంది. ప్రభుత్వం యాన్యుటీలను డెట్ ఫండ్స్ లేదా కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెడుతుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టిన మొత్తం స్థిర ఆదాయాన్ని సృష్టిస్తుంది. మీరు యాన్యుటీపై ఆరు శాతం రాబడిని పొందినట్లయితే, అప్పుడు యాన్యుటీలో పెట్టుబడి పెట్టబడిన మొత్తం రూ. 1,00,30,098 అవుతుంది. అప్పుడు మీకు నెలవారీ పెన్షన్ రూ. 50,150 వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








