Special FDs: ఎఫ్‌డీ చేయాలనుకొంటున్నారా? ఈ రోజే చేసేయండి.. లేకుంటే ఆ అవకాశం కోల్పోతారు!

చాలా ఎఫ్‌డీ పథకాల గడువు 2023 మార్చి 31తో ముగిసిపోతున్నాయి. అంటే ఈరోజుతో మంచి రాబడినిచ్చే ఆ పథకాలు క్లోజ్ అయిపోతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అవి అందుబాటులో ఉండవు. ఆ పథకాలు ఏంటో తెలుసుకోండి.. ఒక్క సెకను కూడా వృథా చేయకుండా బ్యాంకు తలుపుతట్టండి..

Special FDs: ఎఫ్‌డీ చేయాలనుకొంటున్నారా? ఈ రోజే చేసేయండి.. లేకుంటే ఆ అవకాశం కోల్పోతారు!
Fixed Deposit
Follow us
Madhu

|

Updated on: Mar 31, 2023 | 2:41 PM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవలి వడ్డీ రేట్లను పెంచింది. దీని వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఇప్పటికే ఉన్న ఈఎంఐ భారాలు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.  సానుకూల అంశం ఏంటంటే ఫిక్స్ డ్ డిపాజిట్ల రేట్లు మెరుగపడ్డాయి. దీని వల్ల చాలా బ్యాంకులు స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్లను అందించాయి. వినియోగదారులకు ఆకర్షించేందుకు అధిక వడ్డీతో ఆ పథకాలను ప్రవేశపెట్టాయి. ఫలితంగా వాటిల్లో పెట్టుబడి పెట్టిన ఖాతాదారులకు అధిక వడ్డీ వస్తుంది. అలా ప్రవేశపెట్టిన చాలా పథకాల గడువు 2023 మార్చి 31తో ముగిసిపోతున్నాయి. అంటే ఈరోజుతో మంచి రాబడినిచ్చే ఆ పథకాలు క్లోజ్ అయిపోతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అవి అందుబాటులో ఉండవు. ఒక వేళ మీరు ఫిక్స్ డిపాజిట్ చేయాలన్న ఆలోచనలో ఉంటే మీరు ఇక్కడ మేము అందిస్తున్న ఈ పథకాల గురించి వెంటనే తెలుసుకోండి. ఒక్క సెకను కూడా వృథా చేయకుండా బ్యాంకు తలుపుతట్టండి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చింది. అందులో 400 రోజుల టెన్యూర్ గల అమృత్ కలశ్ ప్లాన్ ఒకటి. ఈ పథకంలో సాధారణ డిపాజిట్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఈ ఖాతా ఓపెన్ చేయడానికి గడువు మార్చి 31తో ముగుస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. దేశీయ ప్రైవేటు రంగంలోని దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా సాధారణ కస్టమర్ల కంటే 0.25 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో 10 ఏళ్ల టెన్యూర్ ఉన్న డిపాజిట్లకు గరిష్ఠంగా 7.75 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ రోజే(మార్చి 31) ఈ ఖాతా కూడా ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఐడీబీఐ బ్యాంక్.. సీనియర్ సిటిజన్ల కోసం అదనంగా మోర 0.25 శాతం వడ్డీ అందించేలా ఐడీబీఐ బ్యాంక్ నమాన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్ పేరుతో ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. దీని టెన్యూర్ ఏడాది నుంచి 10 ఏళ్లు ఉంటుంది. కొత్త డిపాజిట్ చేసే వారితో పాటు, ఇప్పటికే ఉన్న డిపాజిట్లను పునరుద్ధరించే వారికీ ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది. దీనిలో ఖాతా ఓపెన్ చేయాలంటే ఈరోజే(మార్చి 31) చేయాలి.

ఇండియన్ బ్యాంక్.. సీనియర్ సిటిజన్లతో పాటు సాధారణ కస్టమర్లకు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తూ ఇండ్ శక్తి 555 డేస్ పేరుతో స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ తీసుకొచ్చింది ఇండియన్ బ్యాంక్. ఇందులో సాధారణ డిపాజిట్లరకు 7 శాతం, సీనియర్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. కనీసం రూ.5వేలు పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. టెన్యూర్ 555 రోజులుగా ఉంది.దీని గడువు కూడా నేటి(మార్చి 31)తోనే ముగుస్తోంది.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్.. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ప్రధానంగా రెండు ప్రత్యేక పథకాలను తీసుకొచ్చింది. పీఎస్‌బీ ఫ్యాబ్యులస్ 300 డేస్, పీఎస్‌బీ ఫ్యాబ్యులస్ 601 డేస్ పేరుతో తీసుకొచ్చింది. వీటితో పాటు ఉత్కర్ష్ 222 రోజుల పథకం, పీఎస్‌బీ ఇ-అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌నూ అందుబాటులోకి తీసుకొచ్చింది. 300 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ ఇస్తుండగా సీనియర్లకు 8 శాతం ఆఫర్ చేస్తోంది. సూపర్ సీనియర్లకు 8.35 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ పథకాలు గడువు కూడా ఈ రోజే(మార్చి 31) ముగుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..