HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు పొడిగింపు

భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కోట్లాది మంది కస్టమర్లకు శుభవార్త అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ)లో పెట్టుబడి పెట్టడానికి గడువును పొడిగించింది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లు 10 మే 2024 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకు ముందు ఈ గడువు 15 ఏప్రిల్ 2024 వరకు మాత్రమే ఉండేది...

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు పొడిగింపు
Hdfc Fd Scheme

Updated on: Apr 20, 2024 | 6:52 PM

భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కోట్లాది మంది కస్టమర్లకు శుభవార్త అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ)లో పెట్టుబడి పెట్టడానికి గడువును పొడిగించింది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లు 10 మే 2024 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకు ముందు ఈ గడువు 15 ఏప్రిల్ 2024 వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు గడువు పెంచడంతో సీనియర్‌ సిటిజన్స్‌కు ఎంతగానో మేలు జరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2020 సంవత్సరం నుండి సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను అందిస్తోంది.

సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీపై వడ్డీ, ప్రయోజనాలు

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 0.50 శాతానికి బదులుగా 0.25 శాతం అదనపు వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 0.75 శాతం అదనపు వడ్డీని ఇస్తుంది. ఇది మీ సాధారణ ఎఫ్‌డీ కంటే కొంచెం ఎక్కువ వడ్డీ అందిస్తోంది. ఇది 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డిలపై సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ వడ్డీ రూ.5 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌ఢీపై లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్లకు 3.50% నుండి 7.75% మధ్య వడ్డీని అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి