Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Insurance: ఇన్సూరెన్స్‌ పేరుతో మీ ఖాతా నుంచి సొమ్ము కట్‌ అయ్యిందా? ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్‌

ఇటీవలి కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో సహా చాలా మంది బ్యాంక్ ఖాతాదారులు తమ సమ్మతి లేకుండా బీమా పథకాల కోసం అనవసరమైన ప్రీమియంలను వసూలు చేయడంపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర పాలసీల వరకు, బ్యాంకులు కస్టమర్‌కు ముందస్తు అనుమతి లేకుండా ఖాతాల నుంచి ఈ పథకాలకు బీమా ప్రీమియంలను డెబిట్ చేస్తున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

SBI Insurance: ఇన్సూరెన్స్‌ పేరుతో మీ ఖాతా నుంచి సొమ్ము కట్‌ అయ్యిందా? ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్‌
Sbi
Follow us
Srinu

|

Updated on: Sep 03, 2023 | 9:30 PM

బ్యాంకు ఖాతాలు కస్టమర్లకు చాలా ప్రయోజనాలను అందిస్తాయి.  ఖాతాదారులు తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడంలో విఫలమైతే వారి ఖాతా నుంచి డెబిట్ చేయబడే వివిధ ఛార్జీల గురించి వారికి తెలియదు. ఇటీవలి కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో సహా చాలా మంది బ్యాంక్ ఖాతాదారులు తమ సమ్మతి లేకుండా బీమా పథకాల కోసం అనవసరమైన ప్రీమియంలను వసూలు చేయడంపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర పాలసీల వరకు, బ్యాంకులు కస్టమర్‌కు ముందస్తు అనుమతి లేకుండా ఖాతాల నుంచి ఈ పథకాలకు బీమా ప్రీమియంలను డెబిట్ చేస్తున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి మనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము కట్‌ అయ్యితే ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

ఇటీవల ఓ బ్యాంకు ఖాతాదారుడు తన ఖాతా నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రూ.23,451 బీమా ప్రీమియంలను ఎస్‌బీఐ డెబిట్ చేసిందని ఆరోపించారు. దీనిపై ఆయన సోషల్‌మీడియాలో ఎస్‌బీఐను ప్రశ్నించగా ఎస్‌బీఐ స్పందించింది. “బీమా, ఇతర పెట్టుబడులను ఎంచుకోవడం పూర్తిగా స్వచ్ఛందమైనది. మా బ్రాంచ్‌లు మా కస్టమర్‌ల ప్రయోజనం, అవగాహన కోసం సమాచారాన్ని అందజేస్తాయని దయచేసి గమనించండి. మేము సేవలను అందిస్తూనే మేము ఉన్నత ప్రమాణాల నీతిని నిర్వహిస్తాం. కస్టమర్‌ల ఖాతాలో అతని/ఆమె సమ్మతి లేకుండా ఎలాంటి లావాదేవీ జరగదు. అలాగే మా నుంచి ఏ రకమైన సేవను పొందేందుకు ఏ రకమైన బీమా లేదా పెట్టుబడి తప్పనిసరి కాదని గుర్తుంచుకోండి.” అంటూ స్పందించింది. అలాగే ఈ సమస్య నిర్ధిష్ట ఫార్మాట్‌లో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాబట్టి మన ఖాతా నుంచి సొమ్ము కట్‌ అయితే ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం. 

ఫిర్యాదు చేయడం ఇలా

ముందుగా సొమ్ము కట్‌ అయిన ఖాతాదారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు పోర్టల్‌తో సమస్యను లేవనెత్తవచ్చు. వారు తమ ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి ఈ దశలను అనుసరించాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి
  • స్టెప్‌-1: ముందుగా సంబంధిత పోర్టల్‌కు వెళి ‘రైజ్ కంప్లైంట్’ ఎంచుకోండి.
  • స్టెప్‌-2: జనరల్ బ్యాంకింగ్ కేటగిరీ కింద ‘వ్యక్తిగత విభాగం/వ్యక్తిగత కస్టమర్’ ఎంచుకోవాలి
  • స్టెప్‌-3: తర్వాత, ‘ఆపరేషన్ ఆఫ్ అకౌంట్స్’ విభాగం కింద ‘వివాదాస్పద డెబిట్’, ‘క్రెడిట్ ట్రాన్సాక్షన్’ మధ్య ఎంచుకోవాలి.
  • స్టెప్‌-4: చివరి కాలమ్‌లో మీ సమస్య యొక్క సంక్షిప్త వివరాలను పేర్కొనాలి. ఫిర్యాదు దాఖలైన తర్వాత, సంబంధిత బృందం విషయాన్ని పరిశీలిస్తుంది.

ప్రత్యామ్నాయంగా వ్యక్తులు తమ ఫిర్యాదును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్‌కి తీసుకెళ్లవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి