Gold Jewellery: వినియోగదారులకు అలర్ట్‌.. మార్చి 31 తర్వాత ఆ బంగారు ఆభరణాలు చెల్లవు.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు

బంగారం కొనుగోలుదారులకు అలర్ట్‌. మార్చి 31వ తేదీ తర్వాత బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో బంగారం అభరణాల..

Gold Jewellery: వినియోగదారులకు అలర్ట్‌.. మార్చి 31 తర్వాత ఆ బంగారు ఆభరణాలు చెల్లవు.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు
Gold Jewellery

Updated on: Mar 16, 2023 | 5:50 AM

బంగారం కొనుగోలుదారులకు అలర్ట్‌. మార్చి 31వ తేదీ తర్వాత బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో బంగారం అభరణాల కొనుగోలు విషయంలో కేంద్ర సర్కార్‌ కీలక మార్పులు చేసింది. హాల్‌ మార్క్‌ లేని బంగారు ఆభరణాలు మార్చి 31, 2023 తర్వాత చెల్లుబాటు కావు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్చి 31 తర్వాత హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (హెచ్‌యూఐడీ) లే ని ఆభరణాలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.

ఈ నిబంధనల ప్రకారం ఏప్రిల్‌ 1, 2023 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. 4,6 అంకెల హాల్‌మార్కింగ్‌ విధానంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినియోగదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్‌ హాల్‌మార్కింగ్‌ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇది లేకుండా బంగారం ఆభరణాలు విక్రయించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇలా హాల్‌మార్కింగ్‌ లేని ఆభరణాలు అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర హెచ్చరించింది. అలాగే నాలుగు అంకెలున్న హాల్‌మార్క్‌లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేశంలో నకిలీ బంగారు అభరణాల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏడాదిన్నర కిందటే ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

HUID అంటే ఏమిటి?

హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (హెచ్‌యూఐడీ) నంబర్‌ అభరణాల స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్‌ కోడ్‌. దీని వల్ల వినియోగదారులు బంగారు అభరణాల గురించి మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీని వల్ల బంగారు అభరణాల విషయంలో మోసాలు తగ్గుతాయి. ప్రతి ఆభరణంపై ఈ నంబర్‌ తప్పనిసరి ఉండాలి. దుకాణదారులు ఏప్రిల్ 1 నుంచి హాల్‌మార్క్‌ లేఇన ఆభరణాలను అమ్మలేరు. కానీ వినియోగదారులు హాల్‌మార్క్ లేకుండా పాత ఆభరణాలను మాత్రం అమ్ముకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 1338 హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. మోసాలను అరికట్టేందుకు కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి