Income Tax: ఆదాయపు పన్ను చెల్లించడానికి ఇష్టపడని భారతీయులు ఎంతమందో తెలుసా?
ఆదాయపు పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు కేవలం 4 శాతం మాత్రమే. 1 శాతం కుటుంబాలు మాత్రమే 20 శాతం కంటే ఎక్కువ పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశంలో ఆదాయపు పన్ను గరిష్ట రేటు 30 శాతం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.40 కోట్ల మందికి పైగా ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారు. వీరిలో 5.16 కోట్ల మందికి పైగా ప్రజలు ఆదాయపు పన్ను బాధ్యత సున్నాగా ఉంది.
దేశంలో ఆదాయపు పన్ను చెల్లించడానికి ఇష్టపడని భారతీయులు దాదాపు సగం మంది ఉన్నారు. పన్ను చెల్లించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్న వారు పావువంతు మంది మాత్రమే. . భారతీయ కుటుంబాలపై నిర్వహించిన Money9 పర్సనల్ ఫైనాన్స్ సర్వే నుండి ఈ ఆసక్తికర సమాచారం వెల్లడైంది. దేశంలోని 20 రాష్ట్రాల్లోని 115 జిల్లాల్లో 35 వేలకు పైగా కుటుంబాలపై నిర్వహించిన ఈ సర్వేలో… 47 శాతం మంది భారతీయులు ఆదాయపు పన్ను చెల్లించడానికి ఇష్టపడడం లేదని తేలింది. సర్వే ప్రకారం, 24 శాతం భారతీయులు మాత్రమే పన్ను చెల్లించడానికి పూర్తి సిద్ధంగా ఉన్నారు, అయితే 29 శాతం మంది భారతీయులు నిర్దిష్ట పరిమితి మేరకు పన్ను చెల్లించాలనుకుంటున్నారు. సర్వే డేటా ప్రకారం, దాదాపు సగం మంది భారతీయులు చాలా తక్కువ పన్ను రేటును కోరుకుంటున్నారు.
49 శాతం భారతీయ కుటుంబాలు 5 శాతం ఆదాయపు పన్ను రేటును మాత్రమే కోరుకుంటున్నాయి. కానీ 37 శాతం కుటుంబాలు 10 శాతం ఆదాయపు పన్ను రేటు రెడీ అన్నాయి. 9 శాతం కుటుంబాలు 15 శాతం వరకు ఆదాయపు పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. మనీ9 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 20 శాతం వరకు ఆదాయపు పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు కేవలం 4 శాతం మాత్రమే. 1 శాతం కుటుంబాలు మాత్రమే 20 శాతం కంటే ఎక్కువ పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశంలో ఆదాయపు పన్ను గరిష్ట రేటు 30 శాతం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.40 కోట్ల మందికి పైగా ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారు. వీరిలో 5.16 కోట్ల మందికి పైగా ప్రజలు ఆదాయపు పన్ను బాధ్యత సున్నాగా ఉంది. ఈ విషయాన్ని కేంద్రం.. ఈమధ్యే పార్లమెంటుకు తెలిపింది. ఇక నికరంగా ట్యాక్స్ కడుతున్నవారు 2.24 కోట్ల మంది మాత్రమే.
మనీ9 పర్సనల్ ఫైనాన్స్ సర్వే ఆగస్టు నుండి నవంబర్ వరకు దేశంలోని 20 రాష్ట్రాల్లోని 115 కంటే ఎక్కువ జిల్లాల్లో నిర్వహించారు. ఈ సర్వేను 10 వేర్వేరు భాషలలో నిర్వహించారు. ఇందులో దేశంలోని 1140 గ్రామాలు లేదా పట్టణ వార్డులు ఉన్నాయి. ఈ సర్వే భారతీయుల ఆదాయం, ఖర్లు, పొదుపు, పెట్టుబడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి