Gold Price Today: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందంటే..

మార్కెట్‌లో బంగారం డిమాండ్, సరఫరా ఆధారంగా బంగారం ధర ఎక్కువగా, తక్కువగా ఉంటుంది. బంగారం డిమాండ్ పెరిగితే రేటు కూడా పెరుగుతుంది. బంగారం సరఫరా పెరిగితే ధర తగ్గుతుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా బంగారం ధర ప్రభావితమవుతుంది. ఉదాహరణకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పేలవంగా పనిచేస్తుంటే, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా బంగారం వైపు ..

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందంటే..
Gold Rate
Follow us
Subhash Goud

|

Updated on: Dec 28, 2023 | 6:18 AM

దేశంలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది. బంగారం ధర పెరిగేందుకు రకరకరాల కారణాలు ఉన్నాయి. తాజాగా అంటే డిసెంబర్‌ 28వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,360 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,820 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,960 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,820 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,63,820 వద్ద కొనసాగుతోంది.

ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.79,200 వద్ద ఉంది.

బంగారం ధరలు ఈ కారణాలపై ఆధారపడి ఉంటాయి

మార్కెట్‌లో బంగారం డిమాండ్, సరఫరా ఆధారంగా బంగారం ధర ఎక్కువగా, తక్కువగా ఉంటుంది. బంగారం డిమాండ్ పెరిగితే రేటు కూడా పెరుగుతుంది. బంగారం సరఫరా పెరిగితే ధర తగ్గుతుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా బంగారం ధర ప్రభావితమవుతుంది. ఉదాహరణకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పేలవంగా పనిచేస్తుంటే, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా బంగారం వైపు చూస్తారు. దీంతో బంగారం ధర పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి