కోటి రూపాయలు గెలుచుకునే అవకాశం.. కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్

ఒకటి.. రెండు రూపాయలు కాదు.. అక్షరాల కోటి రూపాయల వరకు గెలుచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించబోతోంది. మీరు చదువుతున్నది నిజంగా నిజం. జీఎస్టీ వినియోగదారుల(B to C) లావాదేవీలు, వ్యాపారాల ఇన్వాయిస్‌లపై

కోటి రూపాయలు గెలుచుకునే అవకాశం.. కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 03, 2020 | 7:34 AM

ఒకటి.. రెండు రూపాయలు కాదు.. అక్షరాల కోటి రూపాయల వరకు గెలుచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించబోతోంది. మీరు చదువుతున్నది నిజంగా నిజం. జీఎస్టీ వినియోగదారుల(B to C) లావాదేవీలు, వ్యాపారాల ఇన్వాయిస్‌లపై ఏప్రిల్ 1 నుంచి ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ లాటరీల ద్వారా రూ .10 లక్షల నుంచి రూ .1 కోటి రూపాయాల వరకు గెలుచుకునే అవకాశం ఇవ్వబోతోంది.

వినియోగదారులు, వ్యాపారులు మధ్య లావాదేవీల్లో బిల్లులు తీసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఏవైనా వస్తువులు కొన్న తరువాత కస్టమర్‌లు తీసుకునే బిల్లు ద్వారా లాటరీని గెలుచుకోవడానికి అర్హత పొందుతారు. ఇందుకోసం కస్టమర్ మొబైల్ యాప్‌ ద్వారా బిల్లును స్కాన్ చేసి జీఎస్టీ నెట్‌వర్క్ (జీఎస్టీఎన్‌)లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక లక్కీ డ్రాలో ఓ గిఫ్ట్‌తో పాటు, రెండవ, మూడవ బహుమతులు రాష్ట్రాల వారీగా కూడా ఉంటాయని ఒక అధికారి తెలిపారు. లాటరీ ఆఫర్లు రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ ప్రకటించారు.