కరోనా భయం.. ఈ బిజినెస్‌ చేస్తే.. కాసుల వర్షమే!

ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో చాలా మంది ఈ మాస్కులను ధరిస్తున్నారు. అలాగే హ్యాండ్ వాషెస్ క్రీమ్స్, టాయిలెట్ పెపేర్స్, న్యాప్‌కిన్స్ బాగా డిమాండ్ పెరిగింది. చైనాలో వీటికోసం ప్రజలు బారులు తీరుతున్నారు. వీటికోసం పెద్దఎత్తున దొంగతనాలు..

కరోనా భయం.. ఈ బిజినెస్‌ చేస్తే.. కాసుల వర్షమే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 02, 2020 | 5:17 PM

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోన్న విషయం తెలిసిందే. దీని ఎఫెక్ట్‌తో దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. తాజాగా తెలంగాణలో కూడా కరోనా కేసు నమోదయ్యింది. దీంతో.. ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. అలాగే ఈ వ్యాధి సోకకుండా.. కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముఖ్యమైనది. మొఖాలకు సర్జికల్ మాస్కులు ధరించడం. ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో చాలా మంది ఈ మాస్కులను ధరిస్తున్నారు. అలాగే హ్యాండ్ వాషెస్ క్రీమ్స్, టాయిలెట్ పెపర్స్, న్యాప్‌కిన్స్‌కి బాగా డిమాండ్ పెరిగింది. చైనాలో వీటికోసం ప్రజలు బారులు తీరుతున్నారు. వీటికోసం పెద్దఎత్తున దొంగతనాలు కూడా జరుగుతున్నాయి.

ఇదే అవకాశాన్ని యువత ఉపాధిగా మార్చుకుంటే.. కాసుల వర్షం కురుస్తుంది. సర్జికల్ మాస్కుల బిజినెస్ చేపడితే.. వీటికి ఆస్పత్రులు, ప్రజల నుంచి మంచి డిమాండ్ ఉంది. దీన్నే వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. అయితే సర్జికల్ మాస్కులను తయారు చేయడానికి ఒక చిన్న యూనిట్ స్థాపించాల్సి ఉంటుంది. అలాగే వీటిని నాన్ ఓవెన్ క్లాత్‌తో తయారు చేస్తారు. దీని కోసం సర్జికల్ మాస్క్ మేకింగ్ మెషిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకూ ఉంటుంది. అయితే మీరు ఏర్పాటు చేసే పరిశ్రమ బట్టి మెషిన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Example: ఈ మిషన్‌తో గంటకు దాదాపు 10 వేల మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. కనీసం రోజుకు 8 గంటలు పనిచేసినా.. 80 వేల మాస్క్‌లు రెడీ అవుతాయి. ఇలా తయారైన ఒక్కో మాస్కును 50 పైసల చొప్పున అమ్మినా.. రోజుకు రూ.40 వేలు వస్తుంది. ఇందులో సగం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌కి పోయినా.. ఇంకా రూ.20 వేలు మిగులుతాయి. ఇంకా రిటైల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని ఆర్డర్లు తీసుకుంటే.. ఇంకా లాభాన్ని పొందవచ్చు. దాదాపు ఒక్కో మాస్క్‌ని రూ.5 దాకా అమ్మే ఛాన్స్ ఉంది. మరింకెందుకు ఆలస్యం.. మీరూ ఓ సారి ట్రై చేయండి.