ఆ మందులపై GST 5 శాతానికి తగ్గింపు.. జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయం!

|

Sep 10, 2024 | 1:09 PM

భారతదేశ 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు, శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రూ.2000 లోపు డిజిటల్ మనీ లావాదేవీలపై 18% GST విధించడంతోపాటు 2 ముఖ్యమైన అంశాలు చర్చించారు.

ఆ మందులపై GST 5 శాతానికి తగ్గింపు.. జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయం!
Follow us on

భారతదేశ 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు, శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రూ.2000 లోపు డిజిటల్ మనీ లావాదేవీలపై 18% GST విధించడంతోపాటు 2 ముఖ్యమైన అంశాలు చర్చించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ రూ.2000 లోపు చేసే గేట్‌వే చెల్లింపులపై 18% జీఎస్‌టీ విధించడంపై చర్చ జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి వివరాలు, పరిష్కారాల కోసం జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశాన్ని వివరంగా అధ్యయనం చేయడానికి చెల్లింపు కమిటీని పంపిందని చెప్పారు.

18% వరకు GST చెల్లింపుపై గేట్‌వే కంపెనీలకు నోటీసు:

కొన్ని రోజుల క్రితం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 2,000 రూపాయల వరకు లావాదేవీల నుండి డబ్బును స్వీకరించే కంపెనీలకు దాదాపు 18% జీఎస్టీ పన్ను చెల్లించాలని గేట్‌వే కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయం దావానంలా వ్యాపించి పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో జీఎస్టీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అయితే ఈ జీఎస్టీ అంశంపై త్వరలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం, చెల్లింపు అగ్రిగేటర్‌లు రూ. 2,000 కంటే తక్కువ మొత్తంలో లావాదేవీలపై GST చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఇవి కూడా చదవండి

మతపరమైన ప్రయాణాల కోసం హెలికాప్టర్ సేవలపై పన్నును 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ తెలిపారు. అలాగే క్యాన్సర్​ డ్రగ్స్​పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు మంత్రి నిర్మలా సీతారామన్. ఇక కొన్ని రకాల చిరుతిండ్లపై పన్నును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించామని చెప్పారు. కార్​సీట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 28 శాతానికి పెంచామన్నారు.

బీమా ప్రీమియం గురించి తదుపరి సమావేశానికి వాయిదా

అదే విధంగా ఆరోగ్య బీమాపై విధించిన జీఎస్టీ కూడా జీఎస్టీ మీటింగ్‌లో జనం ఎదురు చూస్తున్న మరో అంశం. ఆరోగ్య బీమాపై విధించిన జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ వివిధ వర్గాల నుంచి డిమాండ్లు రావడమే కాకుండా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ కూడా దానిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ విషయంపై నేటి సమావేశంలో చర్చకు వస్తుందని భావించగా, బీమా ప్రీమియంపై చర్చ తదుపరి సమావేశానికి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Aadhaar Update: సెప్టెంబర్‌ 14లోపు ఆధార్‌ అప్‌డేట్‌ చేయకుంటే కార్డు పని చేయదా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి