బుల్లెట్‌ ఫ్రూవ్‌ కారు కొనాలంటే ఇంత కష్టమా..? తయారీకి ముందే ఇవన్నీ తప్పనిసరి..! లేదంటే..

|

Apr 16, 2024 | 8:21 AM

బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించి ప్రజల్లో చాలా సందేహాలు ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి నియమాలు ఏమిటి.? దీనితో పాటు, ఈ వాహనాన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చవుతుంది..? దానిలో ఎలాంటి మార్పులు చేశారు. ? దీని కారణంగానే వాహనం అందులో ఉన్న వ్యక్తికి భద్రతను కలిగిస్తుంది. కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల పూర్తి జాతకాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.

బుల్లెట్‌ ఫ్రూవ్‌ కారు కొనాలంటే ఇంత కష్టమా..? తయారీకి ముందే ఇవన్నీ తప్పనిసరి..! లేదంటే..
Bullet Proof Vehicle
Follow us on

ఏప్రిల్‌ 14 ఆదివారం తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. అందుకే సల్మాన్ ప్రయాణించేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగిస్తాడు. సల్మాన్‌ఖాన్‌లా ఇంకా చాలా మంది వ్యక్తులకు ఇలాగే చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తులు కూడా తమ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కానీ, వారంతా బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనం కొనుగోలు చేయటం అంత సులభం కాదంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి కారు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కఠినమైన నిబంధనలను రూపొందించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించి ప్రజల్లో చాలా సందేహాలు ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి నియమాలు ఏమిటి.? దీనితో పాటు, ఈ వాహనాన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చవుతుంది..? దానిలో ఎలాంటి మార్పులు చేశారు. ? దీని కారణంగానే వాహనం అందులో ఉన్న వ్యక్తికి భద్రతను కలిగిస్తుంది. కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల పూర్తి జాతకాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.

బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేసేందుకు నియమాలు..

బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించింది. నిజానికి, కొంతకాలం క్రితం పంజాబ్‌లోని ఒక నేరస్థుడి నుండి పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించిన అనుమతులపై కొన్ని నియమ, నిబంధనలు విధించింది. మీరు కూడా ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, దీని కోసం వారు జిల్లా అధికారి, ఎస్పీ, పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి. తర్వాత మాత్రమే మీరు మీ సాధారణ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా మార్చుకోగలుగుతారు.

ఇవి కూడా చదవండి

బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు పెరిగిన డిమాండ్ పెరిగింది..ధర విషయానికి వస్తే..

బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తయారు చేసేందుకు రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని, దీని వల్ల వాహనం బరువు 300 నుంచి 700 కిలోలు పెరుగుతుందని వ్యాపార వర్గాల వారు తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ చేయబడిన వాహనాలకు బుల్లెట్లు, బాంబు పేలుళ్ల ప్రభావాన్ని తట్టుకునేలా స్టీల్ బాడీని అమర్చారు. అలాగే వాహనం విండోస్‌కి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చారు. ఇది కాకుండా, వాహనం సన్‌రూఫ్‌లో కూడా బుల్లెట్ ప్రూఫ్ షీట్‌ను కూడా అమర్చారు.

సమాచారం ప్రకారం.. దేశంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల మార్కెట్ పుంజుకుంటోందని, ప్రతి సంవత్సరం 100 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు డిమాండ్ ఉంటుందని వ్యాపార వర్గాల వారు చెబుతున్నారు. నోయిడాలోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాల తయారీ యూనిట్ యజమాని మాట్లాడుతూ.. కొంతకాలంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. కానీ, ఏడాదిలో 20 నుంచి 25 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నామని చెప్పారు.

ఏ వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ చేస్తారు..

బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా మార్చాడానికి ఆ వెహికిల్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు అవసరం. దీనిలో మార్పు చేసిన తర్వాత పెరిగిన బరువును మోయగల ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉండాలి. బుల్లెట్ ప్రూఫ్‌ను పొందే వాటిలో చాలా వరకు టాటా సఫారీ, మహీంద్రా స్కార్పియో, మిత్సుబిషి పజెరో, టయోటా ఇన్నోవా, ఫోర్డ్ అవండర్, టయోటా ఫార్చ్యూనర్, బిఎమ్‌డబ్ల్యూ మరియు ఆడితో పాటు కొన్ని ఇతర SUVలు కూడా బుల్లెట్‌ఫ్రూవ్‌గా మార్చే సామర్థ్యం కలిగి ఉంటాయని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.