Gold Price: మహిళలకు శుభవార్త.. భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతంటే..
Gold Price: అక్టోబర్ 21న ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు 6%, వెండి ధరలు 7% తగ్గాయి. అక్టోబర్ 22న, బంగారం ధరలు 6%, వెండి ధరలు 4% కంటే ఎక్కువ తగ్గాయి. అయితే భారత ధరలు ఇప్పుడు ప్రపంచ ధోరణులకు..

Gold and Silver Prices: భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగి వస్తున్నాయి. తులం బంగారం ధర లక్షా 33 వేల వరకు వెళ్లిన బంగారం ధర.. ప్రస్తుతం లక్షా 25 వేల వరకు దిగి వచ్చింది. ఇక వెండి విషయానికొస్తే 2 లక్షల రూపాయల చేరువలో ఉన్న వెండి ధర ప్రస్తుతం లక్షా 59 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. దీపావళి తర్వాత బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి . అంతర్జాతీయ మార్కెట్ 12 సంవత్సరాల రికార్డు కనిష్ట స్థాయిని నమోదు చేయగా, దేశీయ మార్కెట్ కూడా భారీగా తగ్గింది. అక్టోబర్ 21న ప్రపంచ మార్కెట్లో అమ్మకాలు, దీపావళి-ధంతేరాస్ తర్వాత కొనుగోళ్లు తగ్గడం వల్ల ఈ తగ్గుదల సంభవించింది.
ఇది కూడా చదవండి: Savings Accounts: పొదుపు ఖాతాలపై కన్నేసిన ఐటీ శాఖ.. ఈ లావాదేవీలు చేస్తే జాగ్రత్త!
వెండి ఫ్యూచర్స్ కూడా ఔన్సుకు దాదాపు 2% తగ్గి $46.82కి చేరుకున్నాయి. అయితే, అక్టోబర్ 23వ తేదీ గురువారం బంగారం, వెండి ఫ్యూచర్స్ కొద్దిగా మెరుగుపడి వరుసగా $4,102, $47 కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి. ఇంతలో అక్టోబర్ 22న దేశీయ మార్కెట్లో క్షీణత తర్వాత, మార్కెట్ అక్టోబర్ 23న కోలుకుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.810 తగ్గి రూ.1,25,080 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.750 తగ్గి ప్రస్తుతం రూ.1,14,650కి చేరుకుంది. ఇక వెండి ధరపై రూ.1000 తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,59,000 వద్ద ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,25,080 ఉంది. అలాగే ఢిల్లీలో తులం ధర రూ.1,25,603 ఉంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 29 వరకు పాఠశాలలు బంద్.. కారణం ఏంటంటే..
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గాయి?
బంగారం, వెండి ధరలు వేగంగా తగ్గడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి:
– పండుగ కొనుగోళ్లలో తగ్గుదల: దీపావళి, ధంతేరాస్ సమయంలో బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతుంది. పండుగలు ముగిసిన తర్వాత డిమాండ్ తగ్గింది. దీని ఫలితంగా ధరలు తగ్గాయి.
– ప్రాఫిట్-బుకింగ్: రికార్డు గరిష్ట స్థాయి తర్వాత పెట్టుబడిదారులు లాభాలను పొందేందుకు బంగారం, వెండిని విక్రయించారు.
– ప్రపంచ మార్కెట్ క్షీణత: అక్టోబర్ 21న ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు 6%, వెండి ధరలు 7% తగ్గాయి. అక్టోబర్ 22న, బంగారం ధరలు 6%, వెండి ధరలు 4% కంటే ఎక్కువ తగ్గాయి. అయితే భారత ధరలు ఇప్పుడు ప్రపంచ ధోరణులకు అనుగుణంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: SUV Scooter: భారతదేశపు మొట్టమొదటి SUV స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








