Indian Railways: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!

Indian Railways: ఈ ప్రత్యేక రైళ్లలోని అన్ని కోచ్‌లు అన్‌ రిజర్వ్‌డ్‌ (Unreserved) విభాగానికి చెంది నవి. అందుకే ప్రయాణికులు సాధారణ కౌంటర్ల వద్ద లేదా UTS యాప్ ద్వారా జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. రద్దీని తట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ రైలు..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
Indian Railways

Updated on: Sep 03, 2026 | 9:30 PM

Indian Railways: రైలు ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు రేపు, అంటే 04 సెప్టెంబర్ 2026 న తమ సర్వీసులను అందిస్తాయి.

రైలు నంబర్‌ 07235 -సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్యాహ్నం 12:10 బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే రైలు నంబర్‌ 07236 – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్‌కు సాయంత్రం 6 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు రాత్రి 11.15 గంటలకు చేరుకుంటుంది.

ఇది కూడా చదవండి: PM Kisan: ఈ మహిళా రైతులు పీఎం కిసాన్‌ డబ్బులు పొందలేరు.. ఎందుకో తెలుసా?

ఇవి కూడా చదవండి

ఆగే స్టేషన్లు:

ఈ రెండు జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే మార్గంలో క్రింది ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. చర్లపల్లి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టాఫ్‌లు ఉంటాయని రైల్వే తెలిపింది.

ఈ ప్రత్యేక రైళ్లలోని అన్ని కోచ్‌లు అన్‌ రిజర్వ్‌డ్‌ (Unreserved) విభాగానికి చెంది నవి. అందుకే ప్రయాణికులు సాధారణ కౌంటర్ల వద్ద లేదా UTS యాప్ ద్వారా జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. రద్దీని తట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ రైలు సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Train

ఇది కూడా చదవండి: Budget Cars: కేవలం రూ.3.50 లక్షలకే కారు.. అద్భుతమైన మైలేజీతో తక్కువ ధరల్లో టాప్ మోడల్స్ ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us