AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ వరుస సెలవులు..!

School Holidays: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు, పలు ఇతర రాష్ట్రాల్లోని పాఠశాలలు కూడా ఈ పండుగ సందర్భంగా మూసివేసే అవకాశం ఉంది. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు లేదా వ్యక్తిగత విద్యా సంస్థలు జారీ చేసే నోటిఫికేషన్‌లను..

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ వరుస సెలవులు..!
School Holidays
Subhash Goud
|

Updated on: Sep 03, 2026 | 2:17 PM

Share

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా రేపు (సెప్టెంబర్ 4) పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ పండుగను భారతదేశం అంతటా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు ప్రభుత్వ సెలవు దినాన్ని పాటిస్తాయి. అలాగే సెప్టెంబర్‌ 5న శనివారం టీచర్స్‌ డే కూడా. ఈ రోజు జనరల్ హాలిడే కాకపోయినా.. చాలా స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మరికొన్ని విద్యా సంస్థలు లోకల్ హాలిడేను ప్రకటిస్తాయి. ఇక సెప్టెంబర్ 6న ఆదివారం రావడంతో విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండూ ఈ రోజు మూసి ఉంటాయని భావిస్తున్నారు. ఈ సెలవు విద్యార్థులకు తమ కుటుంబాలతో కలిసి పండుగను జరుపుకోవడానికి, సాంప్రదాయ, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.

హిందూ మతంలో అత్యంతంగా పూజించే దేవుళ్ళలో ఒకరైన శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినోత్సవాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు . ఈ సందర్భంగా దేవాలయాలను అందంగా అలంకరిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. భక్తులు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ఉత్సవ వేడుకలను నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు, పలు ఇతర రాష్ట్రాల్లోని పాఠశాలలు కూడా ఈ పండుగ సందర్భంగా మూసివేసే అవకాశం ఉంది. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు లేదా వ్యక్తిగత విద్యా సంస్థలు జారీ చేసే నోటిఫికేషన్‌లను బట్టి సెలవుల షెడ్యూల్ మారవచ్చు.

వచ్చే వారంలో..

విద్యార్థులకు ఈ వారమే కాకుండా వచ్చే వారం కూడా శుభవార్త ఉంది. సెప్టెంబర్ 12న రెండో శనివారం, సెప్టెంబర్ 13న ఆదివారం, ఆ వెంటనే సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ రానుంది. ఇలా ఈ సెప్టెంబర్ నెలలో వరుస సెలవులతో విద్యార్థులకు ఫుల్ జోష్ దక్కనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us