AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioPC: మీ పాత కంప్యూటర్‌ని కొత్తలా మార్చేయండి.. జియో పీసీ క్లౌడ్ సేవలు ప్రారంభం!

JioPC: జియోపీసీ పాత కంప్యూటర్లను ఎంత శక్తివంతంగా మార్చగలదంటే అవి ఏఐ భారీ ప్రాసెసింగ్, స్టోరేజ్ అవసరాలను సులభంగా నిర్వహించగలవని జియో పేర్కొంది . ఈ కంప్యూటింగ్‌లో గణనీయమైన భాగం జియోపీసీ క్లౌడ్‌లో నిర్వహించబడుతుంది. 8 ఏళ్ల పాత కంప్యూటర్ కూడా నేటి ఏఐ..

JioPC: మీ పాత కంప్యూటర్‌ని కొత్తలా మార్చేయండి.. జియో పీసీ క్లౌడ్ సేవలు ప్రారంభం!
Jiopc
Subhash Goud
|

Updated on: Sep 03, 2026 | 3:43 PM

Share

JioPC: మీ పాత ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ వేగం తగ్గి, మీరు కొత్తది కొనాలని ఆలోచిస్తుంటే ఒక్క నిమిషం ఆగండి. రిలయన్స్ జియో జియోపీసీ, క్లౌడ్ శక్తితో మీ పాత కంప్యూటర్‌ను మరింత శక్తివంతంగా మారుస్తుంది. దీనితో, వినియోగదారులు తమ ప్రస్తుత ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లోనే 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్‌ను పొందగలరు. అన్నింటికన్నా ముఖ్యంగా వారు ఎలాంటి కొత్త హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు రిలయన్స్ జియో క్లౌడ్ పీసీ సేవ అయిన జియోపీసీ, కేవలం జియోహోమ్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది.

అయితే, భారతదేశం అంతటా ఎక్కువ మందికి ఈ సేవను విస్తరించడానికి కంపెనీ అందరికీ అందుబాటులో ఉండే కొత్త ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ సేవను పొందడానికి చందాదారులకు ఇకపై జియోహోమ్ కనెక్షన్ అవసరం లేదు. రిలయన్స్ జియో అనేక జియోపీసీ ప్లాన్‌లను ప్రారంభించింది. వినియోగదారులు 8GB ర్యామ్, 500GB క్లౌడ్ స్టోరేజ్‌తో కూడిన ప్లాన్‌లను లేదా దానికి రెట్టింపు, అంటే 16GB ర్యామ్, 1TB క్లౌడ్ స్టోరేజ్‌తో కూడిన ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ వరుస సెలవులు..!

పాతబడిన హార్డ్‌వేర్, తక్కువ స్టోరేజ్ స్పేస్ లేదా అప్‌డేట్‌లలో వెనుకబడిన ఆపరేటింగ్ సిస్టమ్ వంటి కారణాల వల్ల సంవత్సరాలు గడిచేకొద్దీ కంప్యూటర్ల పనితీరు మందగించిన వినియోగదారుల కోసం జియోపీసీని రూపొందించారు. వినియోగదారులను కొత్త కంప్యూర్‌ లేదా ఖరీదైన అప్‌గ్రేడ్‌ల కోసం ఖర్చు పెట్టేబదులు జియో తన క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించి ఇప్పటికే ఉన్న కంప్యూటర్ సామర్థ్యాలను పెంచడానికి అందిస్తోంది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఏ ఇంటర్నెట్ వినియోగదారు అయినా జియోపీసీని ఒక ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌గా పొందవచ్చు. అంటే మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఏ టెలికాం లేదా బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌తో ఉన్నప్పటికీ, మీరు జియోపీసీని ఉపయోగించవచ్చు. కంపెనీ ప్రకారం, దీనిని ఐదు నిమిషాల కన్నా తక్కువ సమయంలో యాక్టివేట్ చేయవచ్చు. దీనికి ఎలాంటి డేటా మైగ్రేషన్ లేదా కొత్త హార్డ్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు.

ఏఐ యాప్‌లు 8 ఏళ్ల పాత కంప్యూటర్‌లో వర్కింగ్‌:

జియోపీసీ పాత కంప్యూటర్లను ఎంత శక్తివంతంగా మార్చగలదంటే అవి ఏఐ భారీ ప్రాసెసింగ్, స్టోరేజ్ అవసరాలను సులభంగా నిర్వహించగలవని జియో పేర్కొంది . ఈ కంప్యూటింగ్‌లో గణనీయమైన భాగం జియోపీసీ క్లౌడ్‌లో నిర్వహించబడుతుంది. 8 ఏళ్ల పాత కంప్యూటర్ కూడా నేటి ఏఐ-ఆధారిత యాప్‌లకు అవసరమైన పనితీరు, స్టోరేజ్, సామర్థ్యాలను సాధించగలదు.

ధర రూ. 1000 నుండి ప్రారంభం

ఇక ప్లాన్‌ల విషయానికి వస్తే, ప్రారంభ ధర రూ.1,000. 8GB RAM, 500GB స్టోరేజ్‌తో కూడిన రెండు నెలల ప్లాన్ ధర రూ.1,000 కాగా, 16GB RAM, 1TB స్టోరేజ్‌తో కూడిన జియోపీసీ అల్ట్రా రెండు నెలల ప్లాన్‌కు రూ.1,200 ఖర్చవుతుంది.

అదే సమయంలో ఐదు నెలల బేస్ ప్లాన్ ధర రూ. 2,000 కాగా, అల్ట్రా ప్లాన్ ధర రూ. 2,500గా ఉంది. ఇది కాకుండా, 12 నెలల అంటే 10+2 నెలల ప్లాన్ ధర రూ. 4,000 కాగా, అల్ట్రా ప్లాన్ ధర రూ. 5,000గా ఉంది. జియోపీసీ క్లౌడ్‌పై పనిచేస్తుందని గుర్తుంచుకోండి. అందుకే దీనికి మంచి, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. దీనిని బ్రాడ్‌బ్యాండ్ లేదా 4G లేదా 5G కనెక్షన్‌లపై ఉపయోగించవచ్చు.

ఇది కూడా చదవండి: Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనాన్ని టాక్సీగా ఎలా రిజిస్టర్ చేయాలి? పాటించాల్సిన రూల్స్‌ ఇవే..!

ఇది కూడా చదవండి: ChatGPT ద్వారా 7 రోజుల్లో రూ.4,000 సంపాదించవచ్చా? రియల్ లైఫ్ టెస్ట్‌లో వచ్చిన షాకింగ్ నిజాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us