Maruti EV Car: మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కారు లాంచ్?

ఈవీ వాహన రంగం భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తుంది. కానీ ద్విచక్ర వాహనాలు అంటే ముఖ్యంగా స్కూటర్లు ఈవీ మార్కెట్‌ను ఏలుతున్నాయి. కార్ల విషయం కొంత వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అధునాతన ఫీచర్లతో ఈవీ కార్లను కూడా అన్ని కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి. అయితే భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ కూడా ఈవీ రంగంలో అడుగుపెడుతుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Maruti EV Car: మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కారు లాంచ్?
Ev Cars
Follow us

|

Updated on: Apr 16, 2024 | 9:30 AM

ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల చుట్టూ తిరుగుతుంది. రోజురోజుకీ పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ అన్నీ ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఈవీ వాహన రంగం భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తుంది. కానీ ద్విచక్ర వాహనాలు అంటే ముఖ్యంగా స్కూటర్లు ఈవీ మార్కెట్‌ను ఏలుతున్నాయి. కార్ల విషయం కొంత వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అధునాతన ఫీచర్లతో ఈవీ కార్లను కూడా అన్ని కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి. అయితే భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ కూడా ఈవీ రంగంలో అడుగుపెడుతుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకీ సెవెన్ సీటర్ కారును రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. మారుతీ సుజుకీ రిలీజ్ చేసే ఈవీ కారును తెలుసుకుందాం. 

మారుతీ సుజుకీ ప్రస్తుతం భారత మార్కెట్ వాటా 40 శాతానికి పైగా ఉంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్ వాహనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ కంపెనీ క్రమంగా తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోకు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను జోడిస్తుంది. సెవెన్ సీటర్ ఈవీ కారును రిలీజ్ చేస్తుందని పేర్కొంది. మారుతీ సుజుకీ విజన్ 3.0 పేరుతో ఈవీ కారు రిలీజ్ చేయనుంది ఈ కారు ఫ్లెక్స్ ఇంధనం, ఇథనాల్, హైబ్రిడ్, ఈవీల్లో కూడా అందుబాటులో ఉంటుంది. 

ఇప్పటికే మారుతీ ఎర్టిగా, మారుతి ఎక్స్ఎల్ 6 7-సీటర్ వాహనాలు ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. విజన్ 3.0 రోడ్‌మ్యాప్ ద్వారా కంపెనీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, ఇథనాల్‌తో నడిచే కార్లు, హైబ్రిడ్ అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఇప్పుడు కంపెనీ తన కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎమ్‌పివి వాహనంపై పని ప్రారంభించింది. ఈ కారు 2026 ద్వితీయార్థంలో ప్రారంభించే అవకాశం ఉంది. 40 నుంచి 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లతో పాటు డబుల్ మోటార్ సెటప్ అందుబాటులో ఉంటుంది. ఈ కారు పరిధి 550 కిలోమీటర్ల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తుంది. మారుతీకి సంబందించిన ఈ 7 సీటర్ ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన కోడ్‌నేమ్ వైఎంసీగా పేర్కొంటూ ఉంటారు. ఈ కారు మారుతీ కంపెనీకు సంబంధించిన రాబోయే ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లా అదే పవర్‌ట్రెయిన్, బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..!
కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..!
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
'ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ' కూతురిని కత్తితోపొడిచిన తల్లి
'ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ' కూతురిని కత్తితోపొడిచిన తల్లి