Ola Offers: ఓలా స్కూటర్లపై రూ. 5,000 క్యాష్ బ్యాక్.. ఈ ఒక్క రోజే అవకాశం..

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన రెండు ఉత్పత్తులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఓలా ఎస్ 1, ఎస్1 ఎయిర్ స్కూటర్లపై రూ. 5000 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. మీరు ఎంచుకున్న బ్యాంక్ లోన్, ఈఎంఐ ఆప్షన్ ఆధారంగా ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. ఇది ఏప్రిల్ 15 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Ola Offers: ఓలా స్కూటర్లపై రూ. 5,000 క్యాష్ బ్యాక్.. ఈ ఒక్క రోజే అవకాశం..
Ola Scooters
Follow us

|

Updated on: Apr 15, 2024 | 1:19 PM

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఫేమ్ 2 సబ్సిడీ మార్చి 31తో ముగిసిపోయింది. కొత్త స్కీమ్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. దీనిలో సబ్సిడీల శాతం చాలా తగ్గింది. ఫలితంగా అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ ఉత్పత్తులపై ధరలను కొంతమేర పెంచాయి. అయితే ఓలా మాత్రం పెంచలేదు. అంతేకాక క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఏప్రిల్ 15వ తేదీ అంటే సోమవారం వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రూ. 5000 క్యాష్ బ్యాక్..

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన రెండు ఉత్పత్తులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఓలా ఎస్ 1, ఎస్1 ఎయిర్ స్కూటర్లపై రూ. 5000 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. మీరు ఎంచుకున్న బ్యాంక్ లోన్, ఈఎంఐ ఆప్షన్ ఆధారంగా ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. ఇది ఏప్రిల్ 15 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే దగ్గరలోని ఓలా ఎలక్ట్రిక్ డీలర్ షిప్ ను సంప్రదించాలని కంపెనీ సూచిస్తోంది.

రికార్డు స్థాయి సేల్స్..

ఓలా ఎలక్ట్రిక్ 2024 మార్చి నెలలో 53,000 పైగా బుకింగ్స్ నమోదు చేసుకుంది. ఆ నెలలో మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనా శ్రేణిలోనే అత్యధికం. గత ఐదు నెలలుగా ఓలానే ఈ విభాగంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అంతేకాక గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3,28,785 యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు నమోదు చేసిందని ఆ కంపెనీ ప్రకటించుకుంది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే దాదాపు 115శాతం అధికమని, ఆ సంవత్సరంలో 1,52,741 యూనిట్లను విక్రయించినట్లు వివరించింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ షేర్ కూడా గణనీయంగా వృద్ధి చెందినట్లు పేర్కొంది. 42శాతం జనవరి-మార్చి క్వార్టర్ కు వృద్ధి రేటు నమోదు చేసినట్లు వివరించింది. ఈ జనవరి-మార్చి క్వార్టర్ లో 1,19,310 వాహనాలు విక్రయించగా.. గతేడాది ఇదే క్వార్టర్ కు 84,133 యూనిట్లను విక్రయించినట్లు చెప్పింది.

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియోలో మూడు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఓలా ఎస్1 ఎక్స్, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో ఉన్నాయి. దీనికి పోటీగా టీవీఎస్, సుజుకీ, హోండా, బీవైడీ వంటివి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ఉన్నాయి. కాగా మన దేశ మార్కెట్లో ఏథర్, టీవీఎస్ నుంచి ఓలాకు గట్టిపోటీ వస్తోంది. అయినప్పటికీ ఓలా స్థానాన్ని సుస్థిరంచేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles